Rajinikanth :రజినీకాంత్‌ని చెప్పుతో కొడతానన్న డైరెక్టర్.. ఆ ఒక్క మాటతో…
ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాలోయింగ్, క్రేజ్ వేరే లెవెల్. యావరేజ్ టాక్‌తోనే ‘జైలర్’ మూవీ, రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిందంటే దానికి కారణం రజినీకాంత్ స్టామినానే… బస్సు కండక్టర్‌గా ఉన్న రజినీకాంత్ కెరీర్‌ని మార్చింది దర్శకుడు బాలచందర్. రజినీకాంత్ నటించిన 8 సినిమాలకు దర్శకత్వం వహించిన బాలచందర్, నిర్మాతగా మరో 9 సినిమాలను నిర్మించాడు కూడా. అందుకే బాలచందర్ని రజినీకాంత్‌కి గాడ్ ఫాదర్ అంటారు. ‘అంతులేని కథ’, ‘అపూర్వ రాగంగల్’, ‘ఓ సీత కథ’ వంటి సినిమాలతో రజినీకి అటు తమిళ్, ఇటు తెలుగులో గుర్తింపు తెచ్చిపెట్టింది బాలచందర్ సినిమాలే…
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ మూవీ షూటింగ్ అయిపోగానే తన రూమ్‌కి వెళ్లిన రజినీకాంత్, మద్యం తాగి.. విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఓ సీన్ రీషూట్ చేయాలని, బాలచందర్ సర్ రమ్మంటున్నారని పిలవడంతో వెంటనే హుటాహుటీన తిరిగి సెట్స్‌లోకి వెళ్లాడు రజినీకాంత్. మేకప్ వేసుకుని, బాలచందర్ దగ్గరికి వెళ్తే, వాసన కనిపెట్టేస్తాడని దూరం దూరంగా ఉన్నాడు. అయితే బాలచందర్ విషయం కనిపెట్టేశాడు..
రజినీ దగ్గరికి వెళ్లి, ‘నగేష్ ఎంత గొప్ప నటుడో తెలుసు కదా.. అలాంటి ఆయన కెరీర్ కూడా తాగుడు బానిస కావడం వల్ల నాశనం అయిపోయింది. నువ్వు ఇంకోసారి తాగి, సెట్స్‌లో కనిపించావో చెప్పు తీసుకుని కొడతా..’ అంటూ ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయించి, వెళ్లిపోయాడు బాలచందర్. ఆ మాటలకు బాధపడిన రజినీకాంత్, అప్పటి నుంచి ఎప్పుడూ సెట్స్‌లోకి తాగి రాలేదట. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మళ్లీ షూటింగ్‌కి వెళ్లే అవసరం ఉంటుందోనని తాగుడుని దూరం పెట్టేశాడట..