Raju Yadav Movie Review : ‘జబర్దస్త్’లో అనేక రకాల గెటప్స్ వేసి, బుల్లితెర కమల్ హాసన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు గెటప్ శ్రీను. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా వరుస సినిమాలు చేస్తుంటే గెటప్ శ్రీను క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా చిన్నచిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. గెటప్ శ్రీను హీరోగా మారి చేసిన సినిమా ‘రాజు యాదవ్’..
రాజు క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి, దవడలకు సర్జరీ అవుతుంది. దీంతో రాజు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడని డాక్టర్లు చెబుతారు. నవ్వు ముఖంతో రాజు పడే ఇబ్బందులు ఏంటి? సిటీ అమ్మాయితో అతని వన్ సైడ్ లవ్ స్టోరీకి నవ్వు ముఖం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి. ఇదే ‘రాజు యాదవ్’ సినిమా స్టోరీ..
Narendra Modi Biopic : మోదీ బయోపిక్‌లో కట్టప్ప! అంత లేదన్న సత్యరాజ్..
గెటప్ శ్రీను యాక్టింగ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు అందరికీ పరిచయమే. ఎమోషనల్ సీన్స్‌లో నవ్వు ముఖంతో ఇబ్బందిపడుతూ గెటప్ శ్రీను నటన హత్తుకునేలా ఉంది. రాజు యాదవ్ తండ్రిగా నటించిన ఆనంద చక్రపాణి నటన కూడా చాలా ప్లస్ అయ్యింది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. కృష్ణమాచారి రాసుకున్న కథను, తెరకెక్కించడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని కామెడీ సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహాయిస్తే మిగిలిన సన్నివేశాలన్నీ చూసే ప్రేక్షకులకు ముందుగానే అర్థమైపోతాయి.
హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండర్ మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తానికి రాజు యాదవ్ మూవీ అనుకున్నంత వర్కవుట్ కాకపోయినా గెటప్ శ్రీను యాక్టింగ్‌ని ఇష్టడేవారికి కచ్ఛితంగా నచ్చుతుంది.