Vishwak Sen : టాలీవుడ్లో ఇప్పుడున్న హీరోల్లో మినిమం గ్యారెంటీ హీరో ఎవరంటే అది విశ్వక్ సేన్. నెగిటివ్ రివ్యూలు తెచ్చుకున్న ‘ఫలక్‌నుమా దాస్’ ‘పాగల్’ వంటి సినిమాలు కూడా అబో యావరేజ్లుగా మిగిలాయి. ‘దాస్ కా దమ్కీ’ సినిమాతో డైరెక్టర్‌గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు విశ్వక్ సేన్. ‘గామి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్, ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. 2023 నవంబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ మే 31న విడుదల కాబోతోంది. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న విశ్వక్ సేన్, ఎన్టీఆర్ నటించిన ‘నా అల్లుడు’ సినిమా రీమేక్ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు ఎన్టీఆర్ అన్న చేసిన నా అల్లుడు సినిమాని రీమేక్ చేయాలని ఉంది. ఆ సినిమాలో కొన్ని మార్పులు చేసి, నా స్టైల్లో రీమేక్ చేస్తాను.. అవుట్ ఫుట్ చూస్తే ఆశ్చర్యపోతారు..’ అంటూ కామెంట్ చేశాడు విశ్వక్ సేన్.. విశ్వక్ సేన్, ఎన్టీఆర్‌కి అభిమాని అనే విషయం తెలిసిందే.
Narendra Modi Biopic : మోదీ బయోపిక్‌లో కట్టప్ప! అంత లేదన్న సత్యరాజ్..
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో వర ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కింది ‘నా అల్లుడు’ మూవీ. ‘సింహాద్రి’ వంటి ఇండస్ట్రీ హిట్టు తర్వాత ‘ఆంధ్రావాలా’ ఫ్లాప్ కాగా, ‘సాంబ’ యావరేజ్‌గా ఆడింది. పర్లేదు లే, కోలుకుంటున్నామనే సమయంలో 2005 సంక్రాంతికి ‘నా అల్లుడు’ మూవీ వచ్చి, పెద్ద ఫ్లాప్‌ని ఎన్టీఆర్ ఖాతాలో వేసింది.
ఈ సినిమా రిలీజైన మొదటి రోజు సాయంత్రం షోకే బాక్సులన్నీ వెనక్కి వచ్చేశాయని ఓ సందర్భంలో ఎన్టీఆర్ చెప్పాడు కూడా. జాతక రీత్యా కవల పిల్లలు, ఒకరి చేతిలో మరొకరికి చావు తప్పదని జ్యోతిషుడు చెబుతాడు. వారి అత్త, ఆమె ఇద్దరి కూతుర్లతో అల్లుడు చేసే అల్లరి.. ఇలా విజయేంద్ర ప్రసాద్ ఓ సింపుల్ కథనే రాసుకున్నాడు. అయితే సీన్‌కి సీన్‌కి మధ్య సంబంధం లేకుండా సినిమాని చుట్టేయడం, కొన్ని సీన్లు పూర్తి చేయకుండానే చుట్టేయడం చూసి థియేటర్లకి వెళ్లిన జనాలు, ఫ్రస్టేషన్‌కి లోనయ్యారు.
అత్త ఇంటికి వెళ్లి, ఛాలెంజ్ చేసే హీరో.. కాయిన్ ఎగరేసి, బొమ్మ పడితే పెద్దది, బొరుసు పడితే చిన్నది అంటాడు. మరి బొమ్మాబొరుసు కాకుండా పడితే అని పక్కనున్న వ్యక్తి అడిగితే.. అత్త వైపు చూపిస్తాడు. ఈ సన్నివేశమే చీప్‌గా ఉంటే.. అసలు ఏం పడిందో కూడా చూపించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలాంటప్పుడు కాయిన్ టాస్ వేయడం ఎందుకు? ఆ డిస్కర్షన్ అంతా దేనికి? ఇలాంటి సీన్లు ‘నా అల్లుడు’ సినిమాలో చాలానే ఉంటాయి.. ఈ అతుకులను జోడిస్తే, కథపరంగా ‘నా అల్లుడు’ మరీ అంత నాసిరకం సినిమాయేమీ కాదు.