Ram Pothineni : ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీ కావడంతో ఆయన సినిమాలన్నీ తాత్కాలికంగా ఆగిపోయాయి. ఎన్నికలకు ముందు హడావుడిగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ గ్లిప్స్ రిలీజ్ చేశాడు హరీశ్ శంకర్. అయితే ఫేస్ రిప్లేస్మెంట్ టెక్నాలజీతో హరీశ్ శంకర్ బాడీకి పవన్ కళ్యాణ్ తలను అతికించినట్టుగా షాట్స్ ఉండడంతో ఫ్యాన్స్ బాగా డిస్సప్పాయింట్ అయ్యారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం దాదాపు ఖాయమని టాక్ వినబడుతోంది.
Nagarjuna Akkineni : చిరంజీవి, రజినీకాంత్ కాదు.. ఆ విషయంలో ‘కింగ్’ నాగార్జునయే టాప్..
ఎమ్మెల్యేగా గెలిస్తే ముందుగా ‘OG’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాల తర్వాత ‘ఉస్తాద్ భగత్‌సింగ్’కి వెళ్తాడు. అలాగే నెలలో 15 రోజులు సినిమాలకు, 15 రోజులు రాజకీయాలకు కేటాయించాలని ఫిక్స్ అయ్యాడు పవన్. దీంతో ఎలా చూసుకున్నా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తిరిగి ప్రారంభం కావడానికి ఇంకో 6 నెలలు పట్టుద్ది.
ఇప్పటికే రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్న హరీశ్ శంకర్, ఆ సినిమా అయ్యాక రామ్ పోతినేనితో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నాడట. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ తర్వాత రామ్, హరీశ్ శంకర్ మూవీని మొదలెట్టబోతున్నాడు. ఈ మూవీ పూర్తి అయ్యేసరికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే, అటక ఎక్కిన ‘ఉస్తాద్’ని మళ్లీ బయటికి తీస్తాడని టాక్ వినబడుతోంది. ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరచకుండా తాను డూప్‌గా నటించిన పవన్ సీన్స్ అన్నీ కూడా మళ్లీ షూట్ చేయాలని అనుకుంటున్నాడట హరీశ్ శంకర్.