Eesha Rebba : సెకండ్ హీరోయిన్ అని చెప్పి, చిన్న రోల్ చేయించారు..

Eesha Rebba : త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే మెయిన్ హీరోయిన్‌కి బ్రెయిన్ ఉండదు, సెకండ్ హీరోయిన్‌కి అసలు సరైన క్యారెక్టర్ ఉండదు. ‘జల్సా’లో పార్వతి మిల్టన్, ‘అత్తారింటికి దారేది’లో ప్రణీత సుభాష్, ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీలో ఇషా రెబ్బ, ‘అల వైకుంఠపురంలో’ మూవీలో నివేథా పేతురాజ్, ‘ గుంటూర్ కారం’ మూవీలో మీనాక్షి చౌదరి… పేరుకి వీళ్లు హీరోయిన్లే అయినా ఈ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ల కంటే చిన్న రోల్స్ చేశారు..

Prabhas : ప్రభాస్‌కి కథ చెప్పి, దీనికి మీరు సూట్ అవ్వరని చెప్పిన డైరెక్టర్..

‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది తెలుగు అమ్మాయి ఇషా రెబ్బ.. ‘నిజానికి అరవింద సమేత వీర రాఘవ మూవీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎన్టీఆర్‌ గారితో నాకు చాలా సీన్స్ ఉంటాయి. అయితే ఎడిటింగ్‌లో వాటిని కట్ చేశారు. అలాగే ఎన్టీఆర్‌ గారికీ, నాకు మధ్య ఓ సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. అయితే సినిమా లెంగ్త్ ఎక్కువ కావడం వల్ల ఆ సాంగ్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఈ సినిమా నా కెరీర్‌కి హెల్ప్ అవుతుందని అనుకున్నా. కానీ అలా జరగలేదు. కేవలం ఎన్టీఆర్ గారితో, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో పనిచేసే అవకాశం దక్కడం మాత్రమే ఆ మూవీ వల్ల నాకు దక్కిన సంతృప్తి..’ అంటూ చెప్పుకొచ్చింది ఇషా రెబ్బ..

గత ఏడాది సుధీర్ బాబుతో కలిసి ‘మామా మశ్చీంద్రా’ మూవీ చేసింది ఇషా రెబ్బ. అప్పటి నుంచి ఇషాకి మరో సినిమా ఛాన్స్ రాలేదు. విశ్వక్ సేన్‌ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో ఐటెం సాంగ్ చేయాల్సింది. అయితే హెల్త్ సహకరించకపోవడంతో ఈ పాటను ఆయేషా ఖాన్‌తో షూట్ చేశారు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post