OTT Movies : థియేటర్‌లో సూపర్ హిట్టు, OTTలో ఓవర్ రేటెడ్..

OTT Movies : ఈ ఏడాది మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే 5 సినిమాలు రూ.100 కోట్ల కలెక్షన్లు దాటి రికార్డు క్రియేట్ చేశాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు హిట్టు కొట్టడానికి నానా కష్టాలు పడుతుంటే, మలయాళంలో మాత్రం నెలకో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. అయితే థియేటర్లలో సూపర్ డూపర్ హిట్టైన సినిమాలు, ఓటీటీలోకి వచ్చేసరికి ‘Overrated’ మూవీలుగా ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా ఈ సినిమాలు ఓవర్ రేటెడ్‌యేనా?

ఇక్కడ తెలుగులో సంచలన విజయం సాధించిన ‘హనుమాన్’ మూవీని ఉదాహరణ తీసుకోవాలి. థియేటర్లలో ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్‌లో ఈ మూవీలో అడవి మధ్యలో ఓ నది, ఆ నదిలోయ నుంచి అంజనగిరిలో భారీ హనుమాన్ విగ్రహం కనిపించేసరికి అరుపులు, కేకలు, విజిల్స్‌తో ఆ సీన్.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అదే సీన్, ఇంట్లో చూసినప్పుడు అలాంటి ఫీల్ ఉండదు. ఎందుకంటే అక్కడ థియేటర్ వాతావరణం ఉండదు కాబట్టి.. ఇప్పుడు మలయాళ సినిమాల విషయంలో జరుగుతోంది అదే..

Allu Arjun Vs Ram Charan : బన్నీ ఫాలోయింగ్ ముందు తేలిపోయిన చెర్రీ క్రేజ్..

‘ప్రేమలు’ మూవీ పక్కా యూత్‌ఫుల్ లవ్ స్టోరీ. అలాగే ‘మంజుమ్మల్ బాయ్స్’ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ సర్వైవల్ థ్రిల్లర్.. ‘మంజుమ్మల్ బాయ్స్’ వంటి సినిమాల్లో థ్రిల్‌ని ఎంజాయ్ చేయాలంటే సినిమాలో పూర్తిగా లీనం కావాలి. మనమో, మన స్నేహితులో ఆ పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనుభూతి చెందాలి. థియేటర్‌లో అలాంటి ఫీల్‌ వస్తుంది. ఓటీటీలో చూసేటప్పుడు ఓ వైపు ఫోన్ చూస్తూ, మరేదో పనిచేస్తూ సినిమా చూస్తాం.. అలాంటప్పుడు ఆ మూవీ ఓ సాధారణ మూవీగా, బోరింగ్ మూవీగా మారుతుంది..

అదీకాకుండా ఈ కథ తమిళనాడుకి వెళ్లి, లోయలో ఇరుక్కున్న కేరళ కుర్రాళ్ల కథ. అటు మలయాళం, ఇటు తమిళులు ఈ రియల్ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు. తెలుగులో డబ్ చేసేసరికి తమిళ్‌లో డైలాగులు, మలయాళంలో డైలాగులు కూడా తెలుగులోకి అనువదించారు. దీంతో కథ, కథనం అర్థమైనా ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. తెలుగువారికి ‘మంజుమ్మల్ బాయ్స్’ ఎక్కువగా కనెక్ట్ కాకపోవడానికి ఇది కూడా ఓ కారణం.

ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’, మమ్మూట్టీ ‘భ్రమయుగం’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం- The Goat Life’ సినిమాలు కూడా అంతే.. చాలామంది ఒప్పుకోకపోయినా ఒకప్పుడు ఆర్ట్ సినిమాలు తీస్తారని పేరు తెచ్చుకున్న మలయాళ సినిమా, ఇప్పుడు కమర్షియల్ హంగులను కూడా కలిపేసుకుని, అదరగొడుతోంది. కొన్నాళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్‌ ఇండస్ట్రీలను కాపీ కొట్టాలని ప్రయత్నించి, చీకటి కాలాన్ని ఫేస్ చేసిన మాలీవుడ్, ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలకు సవాలు విసురుతోంది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post