Samyuktha Menon : టాలీవుడ్లో నటించే హీరోయిన్లు అందరూ దాదాపు అందరూ కూడా కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్ నుంచి వచ్చినవాళ్లే. తెలుగు హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావు. వచ్చినా స్టార్ హీరోయిన్లు కారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లు, ఇక్కడ డబ్బులు తీసుకుని, స్టార్ డమ్ అనుభవించినా.. తెలుగు సినిమాపై అభిమానం చూపించిన సందర్భాలు చాలా తక్కువ.
త్రిష, శ్రియ, కాజల్ అగర్వాల్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించిన వాళ్లకి కానీ ఇప్పటికీ ఒక్క ముక్క తెలుగు రాదు. అలాగే తాప్సీ, ఇలియానా, మమతా మోహన్‌దాస్ వంటి హీరోయిన్లు, టాలీవుడ్‌ని చులకన చేసి మాట్లాడారు. ఇప్పుడు ఈ లిస్టులో సంయుక్త మీనన్ కూడా చేరిపోయింది..
Mamta Mohandas Strong Comments On Tollywood : టాలీవుడ్లో కథను పట్టించుకోరు, కష్టపడరు..!
కేరళ రాష్ట్రంలో పుట్టి మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాలు చేసి తెలుగులోకి వచ్చింది సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’, ‘డెవిల్’ వంటి సినిమాలు చేసిన సంయుక్త, ప్రస్తుతం నిఖిల్‌తో ‘స్వయంభు’ సినిమా చేస్తోంది.
‘తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయడం చాలా కష్టం. మలయాళం మూవీస్‌లో చాలా ఈజీగా యాక్ట్ చేయొచ్చు. ఎంత కష్టమైన రోల్ అయినా కష్టపడకుండా చేసేస్తాను. తెలుగు లాంగ్వేజ్ రాకపోవడం కూడా ఇక్కడ కష్టపడడానికి కారణం. అదీకాకుండా టాలీవుడ్లో మేకప్ బాగా వేసుకోవాల్సి వస్తుంది. ఓవర్ మేకప్ అన్నిసార్లు కంఫర్ట్‌గా ఉండదు. ప్రతీసారీ మేకప్ చెక్ చేసుకోవాలి. చాలా ఇబ్బందిగా ఉంటుంది..’ అంటూ కామెంట్ చేసింది సంయుక్త మీనన్..