Prabhas : ప్రభాస్‌కి కథ చెప్పి, దీనికి మీరు సూట్ అవ్వరని చెప్పిన డైరెక్టర్..

Prabhas : కెరీర్ ఆరంభంలో ‘వర్షం’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి లవ్ స్టోరీస్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. అలాగే సుకుమార్, ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అటెన్షన్ తెచ్చుకున్నా, అతను తీసే లవ్ స్టోరీస్‌కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సుకుమార్, ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా ఇంతవరకూ సెట్ కాలేదు. అయితే సుకుమార్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ‘ఆర్య’ మూవీని ప్రభాస్‌తో తీయాలనుకున్నాడట నిర్మాత దిల్ రాజు…

‘ఇడియట్’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రవితేజతో సినిమా కోసం ప్రయత్నిస్తున్న నిర్మాత దిల్ రాజు, సుకుమార్ ‘ఆర్య’ కథను మొదట అతనికే వినిపించాడు. అయితే రవితేజ మాత్రం ఆ మూవీ తనకు సెట్ అవ్వదని చేయడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత దిల్ రాజు చెప్పడంతో ఇదే కథను ప్రభాస్‌కి వినిపంచాడట సుకుమార్..

Prabhas : ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్… ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో స్పెషల్ సాంగ్..

అప్పటికి కమర్షియల్ సక్సెస్ అందుకోని ప్రభాస్, ‘ఆర్య’ స్టోరీతో తెగ ఇంప్రెస్ అయ్యాడట. అయితే సుకుమార్ మాత్రం, ‘మీ కటౌట్‌కి ఈ స్టోరీ సెట్ అవ్వదు. సింపుల్‌గా టీనేజ్ కుర్రాడిలా కనిపించే కుర్రాడికి ఈ కథ సెట్ అవుతుందని’ ప్రభాస్ ముఖం మీదే చెప్పేశాడట సుకుమార్.. సుక్కూ మాటలకు ప్రభాస్ కొంచెం హార్ట్ అయినా, అతని ముక్కుసూటి తనానికి ఇంప్రెస్ అయ్యాడట. అలా రవితేజ, ప్రభాస్‌లను దాటిన ‘ఆర్య’ మూవీ, ‘గంగోత్రి’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి, అతని కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది..

‘ఆర్య’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ మూవీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయితే టీవీల్లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత సుక్కూ, బన్నీ కలిసి తీసిన ‘పుష్ప’ మూవీ, హిందీ డబ్బింగ్ వర్షన్ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ‘పుష్ప 2’ మూవీ ఈజీగా రూ.1000+ కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post