Allu Arjun : పవన్‌ ని సపోర్ట్ చేస్తూ ట్వీట్! వైసీపీ ఎమ్మెల్యే కోసం ప్రచారంలోకి.. ఏందిది బన్నీ?

Allu Arjun : పవన్ కళ్యాణ్, ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో నిలిచాడు. పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ చిరంజీవి, అల్లు అర్జున్, నాని, రాజ్ తరుణ్ వంటి స్టార్లు ట్వీట్లు చేశారు. పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ట్వీట్ చేసిన అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే కోసం ఏకంగా ప్రచారం చేయడానికి వెళ్లబోతున్నాడు..

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డిలకు అత్యంత ఆప్తుడు, బంధువు అయిన శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల నుంచి వైఎస్‌ఆర్ సీపీ తరుపున పోటీ చేయబోతున్నాడు. దీంతో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి ఇద్దరూ నంద్యాలలో రవి చంద్ర కిషోర్ రెడ్డిని కలిసి తమ మద్ధతు తెలపబోతున్నారు..

Pawan Kalyan : గెలిచినా, ఓడినా ఆయనెప్పుడూ పవర్ స్టారే!

ఓవైపు మామయ్య పవన్ కళ్యాణ్‌కి అండగా ఉంటానని చెప్పిన అల్లు అర్జున్, మళ్లీ ఇలా ప్రత్యర్థి పార్టీ తరుపు అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఏంటి? ఈ డబుల్ స్టాండర్ట్ వల్ల మామయ్య జనసేన పార్టీకి దెబ్బ పడుతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా హార్ట్ అవుతున్నారు. అయితే రాజకీయాలు వేరు, స్నేహం వేరు. అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తోంది తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి కానీ వైఎస్‌ఆర్‌ పార్టీకి కాదని, అలాగే మామయ్య పవన్ కళ్యాణ్‌కి కానీ ఆయన పార్టీకి కాదని చెబుతున్నారు బన్నీ ఫ్యాన్స్..

ఇప్పటికే ఏపీ పాలిటిక్స్‌లో స్టార్ల క్యాంపెయిన్ బాగా పెరిగింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో పాటు జబర్దస్త్ కమెడీయన్లు, బిగ్ బాస్ సెలబ్రిటీలు, టీవీ యాంకర్లు అక్కడ ప్రచారంలో తెగ బిజీగా గడిపేస్తున్నారు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post