Krishnamma Movie Review : మాస్ సత్యదేవ్ మార్క్..

Krishnamma Movie Review : క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్నచిన్న పాత్రలు చేస్తూనే హీరోగా తనదైన పాత్రలు చేస్తున్నాడు సత్యదేవ్. భిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ, మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సత్యదేవ్ చేసిన 25వ సినిమా ‘కృష్ణమ్మ’. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. వీవీ గోపాల కృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ‘కృష్ణమ్మ’ మూవీని కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు…

డబ్బుల కోసం చేయని నేరాన్ని ఒప్పుకుని, జైలుకి వెళ్తూ ఉంటారు ముగ్గురు కుర్రాళ్లు. అయితే ఓ చిన్న కేసు అనుకుని, చాలా పెద్ద కేసులో ఇరుక్కుంటారు. చేయని నేరానికి వాళ్లకు పడిన శిక్ష ఏంటి? ఆ కేసు నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అసలైన నేరస్థులకు శిక్ష పడిందా? ఇదే లైన్‌ చుట్టూ ‘కృష్ణమ్మ’ మూవీ నడుస్తుంది.

Pawan Kalyan : గెలిచినా, ఓడినా ఆయనెప్పుడూ పవర్ స్టారే!

డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. మన చుట్టూ జరుగుతున్న చాలా నేరాలు, వాటి చుట్టూ జరిగే యథార్త సంఘటనలు గుర్తుకు తెచ్చే డ్రామాతో కథనాన్ని ఆసక్తికరంగా రాసుకున్నాడు. సత్యదేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఒదిగిపోగల చాలా తక్కువ మంది నటుల్లో సత్యదేవ్ ఒకడు. అధీరా రాజ్, అర్చనా అయ్యర్, మీసాల లక్ష్మణ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు..

కాలా భైరవ అందించిన మ్యూజిక్ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. బలమైన పాత్రలు, వాటి చుట్టూ కట్టేపడేసే ఎమోషన్స్, ట్విస్టులతో క్రైమ్ థ్రిల్లర్‌ని చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. క్యారెక్టర్లను పరిచయం చేయడానికి కాస్త సమయం తీసుకోవడంతో ఫస్ట్ 30 నిమిషాలు స్లోగా సాగుతుంది.. అలాగే క్లైమాక్స్ కూడా కాస్త హడావుడిగా ముగించినట్టు ఉంటుంది.

మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవాళ్లకు ‘కృష్ణమ్మ’ కచ్ఛితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్లు సత్యదేవ్ పర్ఫామెన్స్ కూడా ఈ మూవీ చూడొచ్చు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post