Rana Daggubati : యానిమల్ మూవీపై షాకింగ్ కామెంట్స్..

Rana Daggubati : తెలుగులో సాఫ్ట్, సోషల్ మెసేజ్ సినిమాలు తీసే వెంకటేశ్, రానాలతో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తీసి, రచ్చ రచ్చ చేసింది బాలీవుడ్. అడల్ట్ సీన్స్, బూతులు, అసభ్యకర సన్నివేశాలతో వెబ్ సిరీస్‌ని నింపేసి.. దగ్గుబాటికి ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్స్‌ని తీవ్రంగా డిస్సప్పాయింట్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కి సీక్వెల్ తీయాలని నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే ‘రానా నాయుడు 2’ సెట్స్ మీదకి కూడా వెళ్లనుంది.

‘సినిమాలు రియాలిటీకి దగ్గరగా ఉండాలని నేను అనుకుంటాను. అందుకే కొత్త కొత్త జోనర్లలో ట్రై చేస్తాను. గ్యాంగ్ స్టర్ డ్రామా, లైంగిక వేధింపులు కాన్సెప్ట్‌ అనగానే నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి, ఓకే చెప్పాశాను. ఫ్యామిలీ డ్రామా అందరికీ నచ్చుతుందని, అంతా కనెక్ట్ అవుతారని అనుకున్నాం. బయట మాట్లాడడానికి ఇష్టపడని విషయాలను చూపించవచ్చని డిసైడ్ అయ్యాం.

Hero Venkatesh: రాజకీయాల్లోకి విక్టరీ వెంకటేశ్.. వియ్యంకుడిని గెలిపించుకోవడానికి..

సినిమా కంటెంట్ చూశాక నా క్యారెక్టర్ చూసి నాకు కాస్త భయమేసింది. జనాలు ఏమనుకుంటారో అనిపించింది. అయితే యానిమల్ మూవీ చూశాక ఈ ఫీలింగ్ పోయింది. యానిమల్‌లో హీరో క్యారెక్టర్ కంటే రానా నాయుడులో నేను చేసిన క్యారెక్టర్ చాలా బెటర్.. ’ అంటూ కామెంట్ చేశాడు రానా దగ్గుబాటి..

2022లో వచ్చిన ‘విరాట పర్వం’ తర్వాత రానా దగ్గుబాటి మరో సినిమా సైన్ చేయలేదు. గత ఏడాది డిసెంబర్‌లో దర్శకుడు తేజతో కలిసి ‘రాక్షస రాజా’ అనే సినిమా అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పటిదాకా ఈ సినిమా సెట్స్‌ మీదకి వెళ్లలేదు. ప్రభాస్ ‘కల్కి’ మూవీలో రానా నటిస్తున్నాడని టాక్. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post