Ranveer Singh – Deepika Padukone : పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. దీపికాతో విడాకులు తీసుకుంటున్నాడా?

Ranveer Singh – Deepika Padukone : బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ మధ్య మనస్పర్థలు వచ్చాయా? త్వరలో ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? ఇప్పుడు బీ టౌన్‌లో ఇదే హాట్ డిస్కర్షన్.. కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరూ కలిసి ‘కాఫీ విత్ కరణ్ షో’కి హాజరయ్యాడు. ఇందులో దీపికా పదుకొనే చేసిన కొన్ని కామెంట్లతో రణ్‌వీర్ సింగ్ బాగా హార్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య గొడవులు జరుగుతున్నాయని సమాచారం.

Sai Pallavi : ఆ విషయంలో సాయిపల్లవి, నిజంగా హైబ్రీడ్ పిల్లే..

తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ, రణ్‌వీర్ సింగ్ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాడు. 2018 నవంబర్‌లో దీపికా, రణ్‌వీర్ వివాహం జరిగింది. ఈ ఇద్దరి పెళ్లి దగ్గర్నుంచి ఐదేళ్లుగా దాదాపు 133 ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు రణ్‌వీర్ సింగ్. ప్రస్తుతం దీపికా పదుకొనే గర్భవతి కూడా. సెప్టెంబర్‌ 2024లో తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా ప్రకటించింది ఈ జంట..

అయితే సడెన్‌గా దీపికా పదుకొనేతో పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాడు. రణ్‌వీర్ సింగ్ ఎందుకు ఇలా చేశాడు? విడాకుల ముందు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం బాలీవుడ్ సెలబ్రిటీలకు అలవాటు. మరి రణ్‌వీర్ సింగ్ కూడా దీపికా పదుకొనేతో విడాకులు తీసుకోబోతున్నాడా? లేక మరేదైనా ఉద్దేశంతో ఈ పని చేశాడా? త్వరలో తెలియనుంది.

 

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post