Ram Pothineni : వరుస ఫ్లాపులు! ఫ్రీగా ఆ సినిమా కానిచ్చేస్తున్న రామ్..

Ram Pothineni : యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. చాక్లెట్ బాయ్‌ లుక్స్‌తో అమ్మాయిలకు ఫెవరెట్ అయిన రామ్, ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో ఊర మాస్ రఫ్ లుక్‌లో కనిపించాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమా మంచి హిట్టు అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత ‘రెడ్’ యావరేజ్‌గా నిలిస్తే, ‘ది వారియర్’, ‘స్కంద’ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో మళ్లీ హిట్టు కోసం పూరీతోనే చుతులు కలిపిన రామ్, ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ స్మార్ట్’ మూవీ చేస్తున్నాడు.

Allari Naresh : ట్రాక్ మార్చినా ‘అల్లరి’కి సక్సెస్ దక్కలేదే!

ఈ సినిమాని జూన్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అప్పుడెప్పుడో 2023 జూలైలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా, ఆగస్టులో రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. అయితే ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి ఎలాంటి టీజర్ కానీ, సాంగ్ కానీ రాలేదు. మార్చి 8న రిలీజ్ చేయాలని అనుకున్న ‘డబుల్ స్మార్ట్’ మూవీ, జూన్‌లో అయినా వస్తుందా? అనేది అనుమానమే..

సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న ‘డబుల్ స్మార్ట్’ మూవీలో హీరోయిన్ ఎవరు? ఫస్ట్ పార్ట్‌లో నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్, సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారా? లేక కొత్త హీరోయిన్లు వస్తారా? ఇప్పటిదాకా పూరీ రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమాని రామ్ పోతినేని రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేస్తున్నాడట. పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి ఛార్మీ కౌర్ సహ నిర్మాతగా ఉంది. వీరిద్దరూ కలిసి నిర్మించిన ‘లైగర్’ భారీ నష్టాలు తేవడంతో ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ వీరందరికీ చాలా చాలా అవసరం..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post