Prabhas – Hanu Raghavapudi : ‘ఫౌజీ’గా ప్రభాస్..

Prabhas – Hanu Raghavapudi : ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ ఫ్లాపుల తర్వాత ‘సలార్’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ‘కల్కి 2898AD’ మూవీని పూర్తి చేసిన ప్రభాస్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ‘సలార్ పార్ట్ 2’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, ‘కల్కి 2’ సినిమాలు చేయాల్సి ఉంది ప్రభాస్. మధ్యలో లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు ప్రభాస్.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేసే ప్రభాస్- హను రాఘవపూడి సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ‘ఫౌజీ’ అనే సైనికుడు అనే అర్థం వస్తుంది. ‘సీతారామం’ మూవీ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు మామూలుగా లేవు. ‘సీతారామం’ మూవీలో ఓ సోల్జర్, యువరాణి మధ్య బ్యూటీఫుల్ లవ్ స్టోరీ తీసిన హను రాఘవపూడి, ప్రభాస్‌తో కూడా కంప్లీట్ లవ్ స్టోరీ తీయబోతున్నాడు.

Family Star Effect : స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ..

‘ఫౌజీ’ అనే టైటిల్ పెట్టడంతో ఇందులో కూడా హీరో, సైనికుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని రూ.250 కోట్ల బడ్జెట్ అవుతుందని చిత్ర యూనిట్ అంచనా. ఇంతకుముందు ఇలా రూ.300 కోట్లు పెట్టి, ‘రాధేశ్యామ్’ రూపంలో ఓ లవ్ స్టోరీ తీశాడు ప్రభాస్. అది డిజాస్టర్‌గా నిలవడంతో లవ్ స్టోరీకి ఇంత భారీ బడ్జెట్ అంటే భయపడుతున్నారు అభిమానులు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post