Indian 2 Movie : మళ్లీ వాయిదా పడిన ‘ఇండియన్ 2’.. రామ్ చరణ్‌ సినిమాపై ఎఫెక్ట్..

Indian 2 Movie : 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ తీయాలని ఫిక్స్ అయ్యాడు శంకర్. అయితే అప్పుడెప్పుడో 2020లో మొదలైన ‘భారతీయుడు 2’ సినిమాకి ఆటంకాల మీద ఆటంకాలు వచ్చాయి. సెట్స్‌లో క్రెయిన్ కూలి, స్టాఫ్ చనిపోయారు. ఈ ప్రమాదంలో కమల్ హాసన్ కూడా గాయపడడంతో చాలా రోజులు షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్, హీరో కమల్ హాసన్- డైరెక్టర్ శంకర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. శంకర్ ఈ సినిమాని సైడ్ చేసేసి, రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ మొదలెట్టాడు. అయితే లైకా ప్రొడక్షన్స్ వదలకపోవడంతో తిరిగి ‘భారతీయుడు 2’ మూవీ సెట్స్ మీదకి వెళ్లింది.

Trisha Vishwambhara Remuneration : చిరు మూవీ కోసం భారీగా డిమాండ్ చేస్తున్న చెన్నై చంద్రం..

ఎట్టకేలకు ఈ ఏడాది మొదట్లో ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ సినిమాల షూటింగ్స్‌ని పూర్తి చేశాడు కమల్ హాసన్. వీఎఫ్‌ఎక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఈ సినిమాని జూన్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో జూలై 11 లేదా 17 తేదీల్లో రిలీజ్ చేయాలని చూస్తోంది చిత్ర యూనిట్..

ఈ సినిమా వాయిదా పడడంతో ఆ ప్రభావం, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై పడనుంది. ఇప్పటిదాకా ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రాలేదు. అక్టోబర్‌లో సినిమాని రిలీజ్ చేయాలని శంకర్ అండ్ నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘గేమ్ ఛేంజర్’, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే నిలవబోతుందట..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post