Allari Naresh : జంధ్యాల తర్వాత హాస్యచిత్రాలతో తెలుగువారిని కడుపుబ్బా నవ్వించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ఆయన కొడుకు అల్లరి నరేష్, తండ్రి దర్శకత్వంలో కామెడీ సినిమాలు చేసి తెలుగువారికి బాగా చేరువయ్యాడు. అయితే తండ్రి మరణం తర్వాత అల్లరి నరేష్‌కి కామెడీ చిత్రాల నుంచి సరైన సక్సెస్ రాలేదు.
ఎంత ‘అల్లరి’ చేసినా శృతి మించకుండా ఉంటే అందులో అసలైన హాస్యం ప్రేక్షకుల పెదవులపై కనిపిస్తుంది. కడుపుబ్బ నవ్వించే సినిమాలు ఎన్ని ఉన్నా, కామెడీతో పాటు మెసేజ్ ఇవ్వడం ‘హాస్యకిరిటీ’ రాజేంద్రప్రసాద్ స్పెషాలిటీ. 80, 90ల్లో సినిమా ఫ్యాన్స్‌కి రాజేంద్రప్రసాద్ సినిమాల్లో ప్రతీ డైలాగ్, ఆ డైలాగ్‌కి ఆయన ఇచ్చే హవభావాలు, కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి.
OMG 2 Telugu OTT : టీనేజ్ పిల్లలు తప్పక చూడాల్సిన A సర్టిఫైడ్ సినిమా..
తరం మారే కొద్దీ కొత్త నీరు పోయి, పాత నీరు వస్తుంది. ‘జబర్దస్త్’ వంటి కామెడీ షోలు, సోషల్ మీడియా మీమ్స్ కారణంగా ఇంతకుముందులా థియేటర్లలో జనాన్ని నవ్వించలేకపోతున్నారు హీరోలు. టాలీవుడ్‌లో ఆలీ, బ్రహ్మానందం, సునీల్, హర్ష చెముడు ఇలా ఎంత మంది కమెడీయన్లు ఉన్నా, అల్లరి నరేష్ చేసే అల్లరి వేరు.
అలాంటి నరేష్ సినిమాలు నాలుగు ప్లాపులు తర్వాత రూటు మార్చి, సీరియస్ కంటెంట్‌తో ‘నాంది’ సినిమా చేశాడు. ఈ సినిమా సక్సెస్‌తో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సీరియస్ సినిమాలు చేశాడు. అందులో కొన్ని రొటీన్ స్టోరీస్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అల్లరి నరేష్ కామెడీని మిస్ అవుతున్నామనే వారికోసం ట్రాక్ మార్చి సీరియస్ కామెడీ స్టోరీ చెప్తూనే పెళ్లి, పెళ్లి చేసుకోడానికి వచ్చిన తిప్పలు చూపిస్తూ ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ చేశాడు..
Pushpa 2 Teaser : పుష్ప క్రేజ్‌కి ఫేక్ వ్యూస్ ఎందుకు సామి..!?
ఇంతకుముందు తండ్రి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో 10 శాతం కూడా ఈ నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ నవ్వించలేకపోయింది. సినిమాకి సినిమాకి కథ, కథనం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నా, ఈవీవీ లేని లోటు నరేష్ ఎంచుకుంటున్న సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ‘అల్లరి’ నరేష్ ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి..