Family Star Effect : స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ..

Family Star Effect : జెట్ స్పీడ్‌తో యూత్‌లో బీభత్సమైన పాపులారిటీ, క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’, ‘అర్జున్ రెడ్డి’… ఆ తర్వాత ఒక్క సరైన సినిమా పడి ఉంటే, ఈపాటికి టైర్ 1 హీరోల లిస్టులోకి వెళ్లిపోయేవాడే. అయితే ఆ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ సినిమాలు భారీ నష్టాలను తెచ్చాయి. ‘ఖుషీ’ యావరేజ్‌గా ఆడినా, మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్‌గా నిలిచింది. విజయ్ తీసిన గత సినిమాల కంటే ‘ఫ్యామిలీ స్టార్’ బాగానే ఉన్నా, సోషల్ మీడియా ట్రోలింగ్, నెగిటివిటీ కారణంగా థియేటర్ల దగ్గర వసూళ్లు సాధించలేకపోయింది.

Mahesh Babu – Thalapathy Vijay : మహేష్, విజయ్‌తో నెల్సన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్స్‌లో..

ఈ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ రూటు మార్చాడు. స్లోగా ఒక్కో మూవీ చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదని, ఒకేసారి మూడు సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ బడ్జెట్ రూ.100 కోట్లకు పైనే.. ఈ మూవీకి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

గౌతమ్ తిన్ననూరి సినిమా కంప్లీట్ చేశాక ‘రాజా వారు రాణి గారు’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రవికిరణ్ కోల దర్శకత్వంలో సినిమా ఉంటుంది. అలాగే ‘ట్యాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఇంకో సినిమా కూడా ఉంటుంది. మధ్యలో సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబోలో ఓ మూవీ ఎప్పుడో అనౌన్స్ అయ్యింది. అయితే ఈ సినిమా దాదాపు ఆగిపోయినట్టే. సుక్కూ, రామ్ చరణ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ‘పుష్ప 3’ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పట్లో సుకుమార్, విజయ్ దేవరకొండతో పని చేయడం కుదరనట్టే..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post