రష్మికకి ముందు ఓ అమ్మాయిని ప్రేమించి, మోసపోయిన రక్షిత్ శెట్టి.. ఈ లవ్ స్టోరీ వింటే..

Rakshit Shetty : ‘ఛలో’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మంధాన, ‘కిర్రిక్ పార్టీ’ అనే కన్నడ మూవీతో ఆరంగ్రేటం చేసింది. ఈ మూవీ హీరో రక్షిత్ శెట్టి, రష్మిక ‘కిర్రిక్ పార్టీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించుకుని, నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత తెలుగులోకి వచ్చి విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమా చేసిన రష్మిక, రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంది.

పవన్ కళ్యాణ్, నాని, కార్తీ.. ఆ హీరోలకి కలిసి రాని 25వ చిత్రాలు..

విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. దీపావళి కూడా ఈ ఇద్దరూ కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు. ‘ఛార్లీ 777’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైన రక్షిత్ శెట్టి, ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఏ’ మూవీతో మరింత చేరువయ్యాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు రక్షిత్..

Rakshit Shetty who loved a girl before Rashmika and got engaged

‘నేను ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించా. ఆమె కోసం ఓ లవ్ లెటర్ రాసి, నా ఫ్రెండ్‌ని ఇచ్చి తనకి ఇవ్వమని చెప్పా. నేను హాస్టల్‌లో ఉండేవాడిని. ఆమె బస్సులో మంగళూరుకి వెళ్లేది. వాడు కూడా అదే బస్సులో వెళ్లేవాడు..

నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..

లెటర్ ఇవ్వమని చెప్పి, ఆమె ఆన్సర్ కోసం ఎన్నో రోజులు వేచిచూశా. తను మాత్రం ఎప్పటిలాగే మామూలుగా మాట్లాడేది. రెండేళ్ల తర్వాత వాడు, ఆమెకి లెటర్ ఇవ్వనేలేదని తెలిసింది. ఇక్కడ క్లైమాక్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు..’ అంటూ తన కాలేజీ లవ్ స్టోరీని బయటపెట్టాడు రక్షిత్ శెట్టి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post