IPL Effect : ప్రభాస్ సినిమాలకు టీవీల్లో అదిరిపోయే టీఆర్పీ వస్తుంటుంది. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయిన ‘రెబల్’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు కూడా టీవీల్లో మంచి టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్నాయి. ‘మిర్చి’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాలు ఎన్ని సార్లు రిపీట్ అయినా మంచి రేటింగ్ తెచ్చుకుంటాయి. అలాంటి ప్రభాస్ కమ్‌బ్యాక్ మూవీ ‘సలార్’ మంచి అనుకున్న రేంజ్లో థియేటర్లలో పేలలేదు.
‘సలార్’ మొదటి టీవీ టెలికాస్ట్‌కి కేవలం 6.5 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది. ‘సలార్’ మూవీకి ఇంత తక్కువ రేటింగ్ రావడానికి కారణం ఐపీఎల్ పీక్ టైమ్‌లో టెలికాస్ట్ కావడమే. ఐపీఎల్ 2024 మ్యాచులకు రికార్డు టీఆర్పీ దక్కుతోంది. ఐపీఎల్ కారణంగా థియేటర్లకు కూడా వెళ్లడం లేదు జనాలు. అందుకే డైరెక్టర్ అనిల్ రావిపూడి, ‘ఐపీఎల్ తర్వాతైనా చూసుకోవచ్చు, థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి’ అని వేడుకున్నాడు.
Bahubali 3 : త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అంటూ షాక్ ఇచ్చిన జక్కన్న..
ఐపీఎల్ అయ్యేవరకూ పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడమే బెటర్ అని ఆలోచిస్తున్నారు నిర్మాతలు. ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాల్లో ఒక్కటి కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. మార్చి నెలాఖరున వచ్చిన ‘డీజే టిల్లు’ తర్వాత ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వంటి సినిమాలు ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో వచ్చాయి. సెకండ్ వీక్ నుంచి మిడిల్ రేంజ్ సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. మే నెలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే, ఐపీఎల్ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే..