Hari Hara Veeramallu Teaser : టీజర్ దిగింది.. డైరెక్టర్ మారాడు..

Hari Hara Veeramallu Teaser : ఆగిపోయిందనుకున్న పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ నుంచి సడెన్ సర్‌ప్రైజ్‌గా టీజర్ దింపింది చిత్ర యూనిట్. అప్పుడెప్పుడో 2020లో మొదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా అనేక కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ సినిమా తర్వాత షూటింగ్ మొదలైన సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి, వెళ్లాయి. డైరెక్టర్ క్రిష్‌, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఈ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అందుకే సడెన్‌గా ఈ సినిమా టీజర్‌ని సైలెంట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు..

నిజాం నవాబ్‌ దగ్గర్నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే దోపిడి దొంగ, సమరయోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తంలో అరబ్ సైనికులతో పవన్ కళ్యాణ్ చేసే కత్తిసాము ఫైట్ హైలైట్‌గా నిలిచింది.

Pushpa Pushpa Song : అనుకున్న రేంజ్‌ని అందుకోలేకపోయిందా..

‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు పార్టులుగా వస్తుందని నిర్మాత ఏ.ఎం. రత్నం ప్రకటించాడు. ఫస్ట్ పార్ట్‌కి ‘Sword vs Spirit’ అనే టైటల్ పెట్టారు. ‘ధర్మం కోసం యుద్ధం’ అనేది ట్యాగ్ లైన్. ఫస్ట్ పార్ట్‌ని ఈ ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్..

డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి అధికారికంగా తప్పుకున్నట్టే. క్రిష్ స్థానంలో మిగిలిన వర్క్‌ని డైరెక్టర్ జ్యోతి కృష్ణ పూర్తి చేయబోతున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటాడు. బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post