Pushpa Pushpa Song : అనుకున్న రేంజ్‌ని అందుకోలేకపోయిందా..

Pushpa Pushpa Song : 2024 ఏడాదిలో పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమా ‘పుష్ప 2: ది రైజ్’… డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా వంటి క్రికెటర్లు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఫస్ట్ పార్ట్, తెలుగులో కంటే హిందీలో ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దీంతో సెకండ్ పార్ట్ హిందీ డబ్బింగ్ రైట్స్‌‌ని రూ.150 కోట్లకు విక్రయించారు.

ఆగస్టు 15న ‘పుష్ప పార్ట్ 2’ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది సుక్కూ అండ్ టీమ్. అయితే ఇంతకుముందు టీజర్ అంటూ వదిలిన గ్లిప్స్‌కి అనుకున్న రెస్పాన్స్ రాలేదు. టీజర్ అని చెప్పి, అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్‌లో ఉన్న ఫైట్ సీన్స్‌లో కొన్ని సెకన్ల మాత్రమే వదిలారు. తాజాగా ‘పుష్ప పుష్ప’ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ పాట కూడా అనుకున్న రెస్పాన్స్ రాబట్టలేకపోయింది.

Mahesh Babu – Thalapathy Vijay : మహేష్, విజయ్‌తో నెల్సన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్స్‌లో..

‘పుష్ప’ మూవీకి ఉన్న క్రేజ్‌కి ఈ సాంగ్ టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 100K లైక్స్ అందుకున్న లిరికల్ సాంగ్ రికార్డు లేపేస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే టాప్ 10లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు ‘పుష్ప’. ‘సర్కారువారి పాట’ లోని ‘కళావతి’ సాంగ్ 9 నిమిషాల్లో 100K లైక్స్ అందుకుని టాప్‌లో ఉంది.

‘బీమ్లా నాయక్‌’ లోని ‘లాలా బీమ్లా’ 11 నిమిషాల్లో, ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ 12 నిమిషాల్లో, ‘సర్కారువారి పాట’ లోని ‘పెన్నీ సాంగ్’ 13 నిమిషాల్లో 100K లైక్స్ అందుకోగా ‘సలార్’ మూవీలో ‘సూరీడే’ సాంగ్ 15 నిమిషాల్లో 100K లైక్స్ అందుకుని టాప్ 5లో ఉంది. 29 నిమిషాల్లో 100K లైక్స్ అందుకున్న ‘పుష్ప పుష్ప’ సాంగ్, 16వ స్థానంలో ఉంది. కనీసం ఫస్ట్ పార్ట్‌లోని ‘దాక్కో దాక్కో మేక’ రేంజ్‌లో కూడా ‘పుష్ప పుష్ప’ సాంగ్ లేదని ట్రోల్స్ వినిపిస్తున్నాయి.. పాటపై ట్రోల్స్ వస్తున్నా, సాంగ్‌లో చూపించిన విజువల్స్, సీన్స్ మాత్రం ఫ్యాన్స్‌కి తెగ నచ్చేశాయి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post