Vakeel Saab Re – Release: పవన్ మూవీ రీ-రిలీజ్.. ఆఖరికి ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదే..

Vakeel Saab Re – Release : పవన్ కళ్యాణ్‌ సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్ అదిరిపోతాయి. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన అజ్ఞాతవాసి సినిమా కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆయన నటించిన పాత సినిమాలు ఒక్కొక్కటిగా రీ-రిలీజ్ అవుతున్నాయి. ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘ఖుషీ’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి సినిమాల రీ-రిలీజ్ తర్వాత ఇప్పుడు ‘వకీల్ సాబ్’ మళ్లీ థియేటర్లలోకి వచ్చింది..

హిందీలో సూపర్ హిట్టైన ‘పింక్’ సినిమా రీమేక్‌గా వచ్చిన ‘వకీల్ సాబ్’ మూవీని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. 2021 ఏప్రిల్ 9న విడుదలైన ‘వకీల్ సాబ్’ థియేటర్లలో యావరేజ్‌గా ఆడింది. పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రల్లో నటించారు.. ‘వకీల్ సాబ్’ సినిమాని మే 1, 2024న రీ-రిలీజ్ చేశారు.

DJ Tillu2 Heroine : అనుపమ రిస్క్ చేస్తోందా… ‘టిల్లు’ తర్వాత మళ్లీ ‘పరదా’ చుట్టుకుని…

ఈ రీ-రిలీజ్‌ని పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కూడా పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో దాదాపు 60 థియేటర్లలో ‘వకీల్ సాబ్’ మూవీ రీ-రిలీజ్ అయ్యింది. అయితే ఇందులో ఒక షో కూడా హౌస్ ఫుల్ కాలేదు. రీ-రిలీజ్ గురించి సరైన ప్రమోషన్స్ చేయకపోవడం, మూడేళ్ల క్రితం రిలీజైన సినిమాకే పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ‘వకీల్ సాబ్’ రీ-రిలీజ్‌కి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చేసింది.. భారీ ఎండల కారణంగా గత రెండు వారాలుగా పెద్ద సినిమాలను రిలీజ్ చేసేందుకు కూడా నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి టైమ్‌లో ‘వకీల్ సాబ్’ రీ-రిలీజ్ చేసి, పవన్ కళ్యాణ్ పరువు తీసినట్టు అయ్యిందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post