మెనుస్ట్రువల్ కప్ ఎవరు వాడాలి, ఎలా వాడాలి, లాభనష్టాలేంటంటే..

Menstrual Cup Using : పూర్వకాలంలో పీరియడ్ టైంలో మెత్తటి వస్త్రాలను వాడేవారు. వాటి వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు సోకుతుండడంతో శానిటరీ ప్యాడ్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ప్యాడ్స్ నే దాదాపుగా అందరూ వాడుతున్నారు. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా వచ్చినవే మెన్స్ట్రువల్ కప్స్. వీటిని ప్యాడ్స్ లా ప్రతినెలా కొనాల్సిన పనిలేదు, ఒక్కసారి కొంటే 10 సంవత్సరాలు వాడుకోవచ్చు.

Finger Millet : రాగులతో రోగాలు మాయం..

ఈ మధ్యకాలంలో చాలామంది Menstrual Cups Use చేస్తున్నారు. కానీ ఇంకా దీని గురించి అపోహలు, అనుమానాలు భయాలు, పోలేదు. అసలు Menstrual cups ఎందుకు వాడాలి, వీటి వల్ల లాభనష్టాలేంటో చూద్దాం..

శానిటరీ ప్యాడ్స్ (Sanitary Pads) :

ఈ శానిటరీ పాడ్స్ అందరి స్కిన్ కి సెట్ అవ్వదు. అది పెట్టుకోవడం వల్ల సాఫ్ట్ స్కిన్ ఉన్నవాళ్లకి రాషెస్, దద్దుర్లు, ఇన్ఫెక్షన్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాగే మనం బయటికి వెళ్లినప్పుడు లేదా డాన్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఇలాంటివి చేయడానికి శానిటరీ ప్యాడ్స్ కంఫర్ట్ గా ఉండదు. అలాగే ఈ ప్యాడ్స్ లో 4, 5 అవర్స్ ఉండడం వల్ల ఒక రకమైన బడ్ స్మెల్ వస్తుంది. మరి ముఖ్యంగా ఇందులో ఉండే ప్లాస్టిక్ మన ఆరోగ్యానికి, పర్యావరణానికి అలాగే భవిష్యత్ తరాల వారికి చాలా ప్రమాదకరం.

Menstrual Cup Using

Menstrual Cups ఎవరు వాడొచ్చు :
మీకు స్టార్టింగ్ పీరియడ్ నుండి ఎండింగ్ పీరియడ్ వరకు ఏ వయసు వాళ్లయినా వాడొచ్చు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉండదు. ఇందులో మూడు రకాలు సైజులు ఉంటాయి. స్మాల్, మీడియం, లాడ్జ్. స్టార్టింగ్ పీరియడ్ వాళ్ళు స్మాల్ యూస్ చేయొచ్చు. ఒక 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళు.. మీడియం వాడొచ్చు.

ఇంకా ఆ తర్వాత Lodge Use చేయొచ్చు. అలాగే బ్లీడింగ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా లాడ్జ్ యూస్ చేస్తే సేఫ్ గా ఉంటుంది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు.

ఎలా వాడాలి :
ఇవి త్రీ పొజిషన్స్ లో మీకు కంఫర్ట్ ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. అలానే ఇది మీకు Minimum 6 To 8 ఉంటుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ వాష్ చేసుకుని మళ్లీ పెట్టుకోవచ్చు. కాకపోతే దీన్ని పెట్టేటప్పుడు గాని తీసేటప్పుడు కానీ, మీరు మీ కండరాలని బిగించకూడదు. మీరు ఎంత ఫ్రీగా ఉంటే Menstrual Cup అంత ఫ్రీగా పెట్టుకోవచ్చు. తర్వాత రిమూవ్ కూడా చేయొచ్చు.

క్లీనింగ్ అండ్ స్టోరేజ్ ఎలా :
మీరు ఒక్కసారి Menstrual Cups పై Invest చేస్తే 10 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. మీరు ప్రతి నెల Sanitary Pads పై పెట్టే ఖర్చు చాలావరకు సేవ్ చేసుకోవచ్చు. Menstrual Cup యూస్ చేయడానికి ముందు మరుగుతున్న నీళ్లలో 3 To 5 Minutes ఉంచాలి. ఆ తర్వాత తీసి,  బాగా ఆరిన తర్వాత మళ్లీ యూస్ చేసుకోవచ్చు. మళ్లీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత వాటర్ బాయిల్లో క్లీన్ చేసుకుని తుడిచి శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీకు కంఫర్ట్ ఉన్న ప్లేస్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మీరు 10 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు.

అల్లోపతి V/S ఆయుర్వేదం..

ఉపయోగాలు :
ఇది పెట్టుకోవడం వల్ల మీకు పీరియడ్స్ ఉండే Un Easyness ఫీలింగ్ అస్సలు ఉండదు. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే ఎలాంటి స్కిన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. అలానే మీరు చేసే రోజువారి పనులు చాలా యాక్టివ్ గా చేసుకోవచ్చు. స్విమ్మింగ్, జాగింగ్, సైకిల్  ఎక్సర్సైజెస్ ఎలాంటి ఆక్టివిటీస్ అయినా హ్యాపీ గా చేసుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఈ మధ్య మార్కెట్లోకి ఆన్లైన్లోకి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఈ Menstrual Cups దొరుకుతున్నాయి. కానీ వీటిలో స్మూత్ గా ఉండేవి కొన్ని మంచి కంపెనీలు మాత్రమే తీసుకోండి. హార్డ్ గా ఉంటే మీకు పెట్టుకునేటప్పుడు, అలాగే తీసేప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే యూస్ చేయడానికి ముందు, యూస్ చేసిన తర్వాత కూడా హీట్ వాటర్ లో క్లీనింగ్ కంపల్సరీ.

Menstrual Cup Using

అలాగే Menstrual Cup ఎవరివి వారు మాత్రమే వాడాలి. Sanitary Padsలా వీటిని షేర్ చేసుకోకూడదు. అలానే Menstrual Cup పెట్టుకునేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తీసేసి క్లీన్ చేసి మళ్లీ పెట్టుకున్న తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం Menstrual Cups యూస్ చేస్తున్నప్పుడు మాత్రం హాలిడే రోజు, లేదంటే మీరు ఇంట్లోనే ఉంటాము అనుకున్నప్పుడు మాత్రమే ట్రై చేయండి.

మీకు మీ బ్లీడింగ్ ఫ్లోటింగ్, అలానే ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలో ఒక ఐడియా వస్తుంది. కొత్తగా వాడే వారికి 1, 2 నెలలు ఇబ్బందిగా  అనిపించొచ్చు ఆ మాటకొస్తే మనకు ముందు నుంచి Pads వాడటం మాత్రం అలవాటుందా ఇదీ అంతే.. వయస్సు పెరుగుతుంటే ఆడవారి శరీరంలోకి కొన్ని అదనంగా వచ్చి చేరాయి కష్టంగా అనిపించినా తప్పలేదు. ప్రతి దశలోనూ అవసరానికి సౌకర్యాన్ని మేళావించాం.. ఇప్పుడు Padsని Menstrual Cupsతో Replace చేయండి. అందులోని సౌకర్యం కొన్నాళ్ళకు మీకే అర్థం అవుతుంది.

ఏమయ్యాయి.. ఆ రోజులు..!?

Note : ఇంకా కొంతమందికి ఉండే అపోహ ఏంటంటే.. పెళ్లి కాని వాళ్ళు ఈ Menstrual cups యూస్ చెయ్యొచ్చా ఇవి పెట్టుకోవడం వల్ల వర్జినిటిని కోల్పోతారా అని అనుమానం ఉంటుంది, ఇది కేవలం అపోహ మాత్రమే. వర్జినిటీ కి Menstrual cups కి ఎలాంటి సంబంధం లేదు.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post