Rajamouli : ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాలీవుడ్ పెద్ద కుటుంబాలకు చెందిన హీరోలను పెట్టి ‘RRR’ మూవీ చేశాడు రాజమౌళి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిగా బాధపడినా, ఇద్దరు హీరోలకు గ్లోబల్ రేంజ్లో గుర్తింపు తెచ్చిపెట్టింది ‘RRR’ మూవీ.. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను సెలక్ట్ చేసుకుని, ఓ ఫిక్షనల్ స్టోరీతో మెప్పించాడు రాజమౌళి.
అయితే వాస్తవానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ప్రేమదేశం’ లాంటి మూవీ తీయాలని అనుకున్నాడట జక్కన్న.. అందుకు కథ లైన్ కూడా సిద్ధం చేసుకున్నాడట. అయితే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కోసం లవ్ స్టోరీని పక్కనబెట్టి, తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో ‘RRR’ మూవీ చేశాడు.
Jagapathi Babu : ఆ మూవీకి చాలా కష్టపడ్డా.. చివరకు జోకర్ని చేశారు..
మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘RRR’ వరకూ రాజమౌళి కంప్లీట్ లవ్ స్టోరీ ఎప్పుడూ తీసింది లేదు. ప్రతీ సినిమాలో ఓ లవ్ స్టోరీ ఉన్నా, అది సైడ్ ట్రాక్ మాత్రమే! రాజమౌళి లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుందో చూడాలని కోరుకునే ఫ్యాన్స్ ఉన్నారు. ‘బాహుబలి’, ‘RRR’ తర్వాత హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయిన రాజమౌళి నుంచి సింపుల్ లవ్ స్టోరీ ఇక రావడం కష్టమే..