Nora Fathehi : బాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లతో డేటింగ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం చాలా కామన్. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య, కరీనా- సైఫ్ ఆలీ ఖాన్, ఆలియా భట్- రణ్‌బీర్, రణ్‌వీర్ – దీపికా.. ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ దాదాపు ఇండస్ట్రీలోని వాళ్లకే పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఐటెం గర్ల్ నోరా ఫతేహి..
‘బాలీవుడ్‌లో చాలామంది ఫేమ్ కోసమే అన్ని పనులు చేస్తారు. చాలామంది ఫేమ్, డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే ఓ మూడు నాలుగేళ్లు అతనిపై లేదా ఆమెపై ఆధారపడి అవకాశాలు దక్కించుకోవచ్చని అనుకుంటారు. అందుకే సక్సెస్‌లో ఉన్న హీరోలు, నిర్మాతల చుట్టే ఎక్కువ మంది హీరోయిన్లు డేటింగ్ చేస్తూ ఉంటారు..
DeAr Movie Review : గుడ్ నైట్ మూవీని అటు ఇటుగా..
డబ్బులు, మనీ కోసం పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అసలు ఏ మాత్రం ప్రేమ లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతనితో జీవితం పంచుకోవడం కంటే దరిద్రం ఇంకేం ఉంటుంది? అందుకే చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. ఒకరు వర్కవుట్ కాకపోతే ఇంకొకరు అని బ్యాకప్ ప్లాన్స్ కూడా ఉంటాయి.. ఇదంతా కేవలం డబ్బు, ఫేమ్ కోసం చేసే సర్కస్.. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు..’ అంటూ చెప్పింది నోరా ఫతేహి..