Pawan Kalyan : అవి మనకెందుకంటే, మడిచి పెట్టుకో అన్నాడు..

Pawan Kalyan : స్టార్ రైటర్ కోన వెంకట్‌కి ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద పరిచయాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ని కూడా నువ్వు అని సంభోదించి, మాట్లాడే స్నేహం ఆయనది. ప్రెజెంట్ కోన వెంకట్ నిర్మాతగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా విడుదలకు రెఢీ అవుతోంది. ఈ సినిమా హీరోయిన్‌ అంజలికి 50వ సినిమా. గత 20 ఏళ్లలో తెలుగు హీరోయిన్ 50 సినిమాలు చేయడం చాలా పెద్ద విశేషమే..

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు కోన వెంకట్. ‘పవన్ కళ్యాణ్‌కి నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే ఆయనకి ఓ సలహా ఇచ్చాను. నువ్వా పెద్ద ఇంట్రోవర్ట్‌వి. చాలా సెన్సిటివ్ మనిషివి. ఎవడు పడితే వాడు మాటలు అంటున్నాడు.. అవసరమా నీకు ఇవన్నీ..నీకెందుకు ఈ చెత్త పాలిటిక్స్ అని చెప్పాను. ఆయన వెంటనే నీ అభిప్రాయం ఎవడూ అడగలేదిక్కడ, నీ సలహా మడిచి పెట్టుకో అన్నాడు…’ అంటూ చెప్పుకొచ్చాడు కోన వెంకట్..

Ambati Rambabu : పవన్ కళ్యాణ్ కూడా నాలా డ్యాన్స్ చేయలేడు..

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ఏప్రిల్ 11న విడుదల అవుతోంది. ఈ మూవీలో ‘గీతాంజలి’ మూవీలో నటించిన శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్ అందరూ నటిస్తున్నారు. ట్రైలర్‌కి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా పవన్ కళ్యాణ్ మీద కామెంట్లతో పబ్లిసిటీ తెచ్చుకోవాలనేది కోన వెంకట్ ప్రయత్నమని ఇట్టే తెలిసిపోయింది. లేకపోతే ఈ మూవీకి పవన్ కళ్యాణ్‌కి అసలు సంబంధం ఎక్కడుంది?

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post