This Week Movie Releases : ఈవారం అలరించనున్న చిత్రాలు..

This Week Movie Releases : సంక్రాంతి సీజన్ తర్వాత సినిమాలకి సమ్మర్ సీజన్ చాలా ముఖ్యం. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్‌లో వచ్చే సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్లు దండిగా ఉంటాయి. అందుకే సంక్రాంతికి మిస్ అయిన వాళ్లు, సమ్మర్‌ని టార్గెట్ చేస్తుంటారు. ఈ ఏడాది వేసవి వినోదాల జోరు సాగుతుంది. థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుస కడుతున్నాయి. మరోపక్క ఓటీటీలో అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈవారం థియేటర్ మరియు ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం..

గీతాంజలి మళ్లీ వచ్చింది :
భయపెడుతూనే ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన చిత్రం “గీతాంజలి”. అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సీక్వల్ గా ఇప్పుడు రాబోతున్న సినిమానే “గీతాంజలి మళ్లీ వచ్చింది”. గీతాంజలి సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి ఈ సీక్వెల్ మొదలవుతుందని ఇప్పటివరకు వచ్చిన కామెడీ హర్రర్ సినిమాలు అన్నిటిని మించేలా ఉంటుందని ఈ సినిమా బృందం తెలిపింది. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Pushpa 2 Teaser : టీజర్ అన్నారు, చిన్న ముక్క వదిలారు.. వాయిదా కన్ఫార్మ్ చేసినట్టేనా..

శ్రీరంగ నీతులు :
సుహాస్, కార్తీక్ రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్ర‌ల్లో నటించి చిత్రం శ్రీరంగ నీతులు. ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం థియేటర్ లోకి రానుంది.

లవ్ గురు :
“ప్రేమ విశ్వజనేనమైనది, అది ఎక్కడైనా ఒకటే. ఈ సమాజంలో దాదాపు 90% మంది అందుకే ప్రేమకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని ఈ సినిమాలో లవ్ గురు ఎలా పరిష్కారం చూపిస్తాడు అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు విజయ్ ఆంటోనీ, ఆయన హీరోగా నటిస్తూ స్వయంగా ఆయనే నిర్మిస్తున్న చిత్రమే ఈ “లవ్ గురు”. రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానుంది.

డియర్ :
జీవి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య కలిసి నటించిన ఫ్యామిలీ డ్రామా “డియర్”తమిళ్లో ఏప్రిల్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఒక్కరోజు ఆలస్యంగా ఏప్రిల్ 12న తెలుగులోనూ అలరించనుంది. ఆనంద రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భార్య గురక పెట్టడం వల్ల భర్త ఎలాంటి ఇబ్బందులు పడతాడు? వారి రిలేషన్షిప్ ఎలాంటి సమస్యలకు దారితీస్తుంది అనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించారు.

Tier 2 Heros : సిద్ధూ, విశ్వక్ సేన్ పైకి.. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని కిందకి..

మైదాన్ :
క్రీడాకారులకు స్ఫూర్తితో నింపుతూ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్.. భారత్ ఫుట్బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబుల్ రహీంగా నటిస్తున్న సినిమా “మైదానం”. అజయ్ ప్రియమణి జంటగా అమిత్ శర్మ దర్శకత్వం వహించగా, బోని కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11న ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది.

ఈవారం ఓటీటీ లో అలరించే సినిమాలు/ వెబ్ సిరీస్ ఇవే..

నెట్ఫ్లిక్స్ :
* అమర్ సింగ్ చమీక్లా ( హిందీ) ఏప్రిల్ 12
* హార్ట్ బ్రేక్ హై (వెబ్ సిరీస్ 2) ఏప్రిల్ 11
* అన్ లాక్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 10
* బేబీ రెయిన్ డీర్ (హాలీవుడ్) ఏప్రిల్ 11
* వాట్ జెనీఫర్ డిడ్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 10

జి ఫైవ్ :
* గామి (తెలుగు) ఏప్రిల్ 12

అమెజాన్ ప్రైమ్ :
* ఫలౌట్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 12

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post