Pushpa 2 The Rule: అందుకే పుష్ప 2లో చీరలో బన్నీ..

Pushpa 2 The Rule : 2024 ఏడాదిలో భారీ అంచనాలతో విడుదల అవుతున్న సినిమాల్లో ‘పుష్ప 2: ది రూల్’ ఒకటి. కచ్ఛితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే సినిమాగా ‘పుష్ప 2’ సినిమాని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి వేషధారణలో కనిపిస్తున్న పోస్టర్ విడుదల అయినప్పటి నుంచి అంచనాలు మరింత పెరిగిపోయాయి. బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ని రిలీజ్ చేశారు..

ఈ టీజర్‌ని గమనిస్తే, పుష్పరాజ్ కట్టుకున్న చీర, ఇంతకుముందు విడుదల అయిన పోస్టర్లలో శ్రీవల్లి (రష్మిక మంధాన) వేసుకుంది. అంటే విలన్ గ్యాంగ్, శ్రీవల్లిని కిరాతకంగా దాడి చేసి చంపేస్తే.. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి భార్య చీరలో పుష్పరాజ్.. వారిపై విరుచుకుపడతాడు..

Allu Arjun – Pawan Kalyan: మేనమామ పవన్ ని బన్నీ, ‘బాబాయ్’ అని ఎందుకు పిలుస్తాడు?

ఇంతకుముందు ‘కేజీఎఫ్’ వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ చనిపోవడం, ఆ వెంటనే హీరో, విలన్లపై విరుచుకుపడి వారిని అంతం చేయడం వంటి సీన్స్ ఉన్నాయి. అయితే ‘పుష్ప 2: ది రూల్’ మూవీలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ చీర కట్టి గంగమ్మ తల్లి వేషధారణలో తన శత్రువులను అంతం చేయడం సినిమాకే హైలైట్‌గా మారుతుందట. అందుకే టీజర్‌లో కేవలం గంగమ్మ జాతరకు సంబంధించిన కొన్ని సీన్స్ మాత్రమే కట్ చేసి వదిలారు సుక్కూ అండ్ కో…

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post