Mani Ratnam Thug Life : మణిరత్నం ‘థగ్ లైఫ్’లో ఏముంది..!?

Mani Ratnam Thug Life : మణిరత్నం దర్శకత్వంలో నటించాలని బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కొన్నాళ్లుగా మణి టైమ్ అస్సలు బాగోలేదు. ‘బాహుబలి’ రికార్డులు బ్రేక్ చేస్తానని చెప్పి తీసిన ‘పొన్నియన్ సెల్వం’ మూవీకి తమిళ్‌లో బాగానే వసూళ్లు వచ్చినా, మిగిలిన భాషల్లో డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’ అనే సినిమా మొదలెట్టాడు మణిరత్నం.

ఈ సినిమాలో తొలుత నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఆమె తగ్గకపోవడంతో త్రిష వచ్చింది. అయితే నయనతార అడిగిన దాని కంటే త్రిషకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. అయితే నయనతార ఈ ప్రాజెక్ట్ చేయకపోవడానికి రెమ్యూనరేషన్ కారణం కాదు! ఇంకేదో ఉంది.

Chiranjeevi : ఆ నిర్మాత తిట్టడం వల్లే నాలో కసి పెరిగింది..

ఈ సినిమాలో జయం రవి, దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్రల్లో నటించబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే దుల్కర్ సల్మార్, మార్చి 2024లో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో జయం రవి కూడా ‘థగ్ లైఫ్’ నుంచి సైడ్ అయిపోయాడు. మణిరత్నంతో సినిమా అంటే షారుక్ కూడా ఎన్ని కాల్షీట్స్ ఇవ్వడానికి రెఢీ అని అనేవాడు. అలాంటిది వీళ్లు ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు?

దుల్కర్ సల్మాన్ ప్లేస్‌లో శింబుని, జయం రవి ప్లేస్‌లో అరవింద్ స్వామిని తీసుకున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘థగ్ లైఫ్’ మూవీలో కమల్ హాసన్ 3 పాత్రల్లో కనిపించబోతున్నాడట. మణిరత్నం, కమల్ కలిసి 1987లో ‘నాయకన్’ (తెలుగులో నాయకుడు) సినిమా చేశారు. 35 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ తిరిగి ‘థగ్ లైఫ్’ సినిమా చేస్తున్నారు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post