Family Star Review : తక్కువ సినిమాలతో యూత్‌కి క్రేజీ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. అయితే ‘అర్జున్ రెడ్డి, ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండకి యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది. కొంతమందికి ఈ యాటిట్యూడ్ నచ్చినా, మనోడి ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా ‘లైగర్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి డిజాస్టర్లు చూడాల్సి వచ్చింది. ‘ఖుషీ’కి పాజిటివ్ టాక్ వచ్చినా, ఆంధ్రాలో నష్టాలు తప్పలేదు. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌కి పరీక్షగా మారిన సినిమా ‘ది ఫ్యామిలీ స్టార్’..
‘గీత గోవిందం’ కాంబో పరుశురామ్, విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ చేసిన మూడో తెలుగు సినిమా ఇది. మరి విజయ్ కోరుకున్న సక్సెస్‌ని ‘ది ఫ్యామిలీ స్టార్’ ఇచ్చాడా?
Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్ తగ్గిందా..!?
మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన గోవర్థన్ (విజయ్ దేవరకొండ), పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోయి బతకడానికి అలవాటు పడిపోతాడు. అలాంటి హీరో జీవితంలోకి అనుకోని అతిథిగా వస్తుంది హీరోయిన్.. ఇదే సమయంలో తన బామ్మ గురించి, తన కుటుంబం గురించి గోవర్థన్‌కి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మరి తన కుటుంబానికి వచ్చిన ఇబ్బందిని గోవర్థన్ ఎలా కాపు కాచాడు.. ఇదే ‘ది ఫ్యామిలీ స్టార్’ కథ..
‘సుప్రీం హీరో’ చిరంజీవిని, ‘మెగాస్టార్’గా మార్చిన ‘గ్యాంగ్ లీడర్’ కథను రీమేక్ చేసినట్టు అనిపించినా, టేకింగ్ విషయంలో పరుశురామ్ స్టైల్ కనిపిస్తుంది. మహేష్‌తో ‘బ్యాంక్ అంటే దేవాలయం’ అని చెప్పించిన పరుశురామ్, ఈసారి విజయ్ దేవరకొండతో ‘కుటుంబమే దేవుడు’ అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్, మిడిల్ క్లాస్ డ్రామాతో సాగిపోయే ‘ది ఫ్యామిలీ స్టార్’, సెకండాఫ్‌లో ఎమోషనల్ కనెక్టివిటీ కోసం కాస్త కష్టపడతాడు.
గోపి సుందర్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా ప్రెష్ ఫీలింగ్‌ని ఇస్తుంది. క్లైమాక్స్ చాలా కమర్షియల్ సినిమాల్లాగే ముందుగా ఊహించేలాగే ఉంటుంది. నటుడిగా విజయ్ దేవరకొండ, ఈ మూవీలో ఇంకాస్త మెచ్యూర్డ్‌గా నటించాడు. కరెక్ట్‌గా వాడుకుంటే మంచి మాస్ హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ విజయ్‌లో కనిపిస్తాయి. మృణాల్ మరోసారి మ్యాజిక్ చేసింది. బామ్మ రోహిణి, రోహిణి, వెన్నెల కిషోర్ అండ్ కో తమ పాత్రల్లో ఒదిగిపోయాయి.
Vijay Deverakonda : ఆడిషన్స్‌కి వెళ్తే నన్ను రిజెక్ట్ చేశారు! ఇప్పుడు అదే బ్యానర్లో..
మొత్తానికి మిడిల్ క్లాస్‌కి ‘ది ఫ్యామిలీ స్టార్’ కనెక్ట్ అయితే, బాక్సాఫీస్ దగ్గర కుమ్మేయడం గ్యారెంటీ. అయితే విజయ్ దేవరకొండ సినిమా అంటేనే మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ మొదలైపోతుంది. ఈ సినిమాకి కూడా మొదటి షో పడకముందే ఫ్లాప్ టాక్ వ్యాపించింది. దీన్ని తట్టుకుని, ‘ది ఫ్యామిలీ స్టార్’ హిట్టు కొడితే, విజయ్ దేవరకొండ తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టు కొట్టేసినట్టే..