Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్ తగ్గిందా..!?

Vijay Deverakonda : అతి తక్కువ సినిమాలతో తెలుగులో క్రేజీ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ట్యాక్సీవాలా… తర్వాత విజయ్ దేవరకొండకి వరుసగా ఫ్లాపులు వచ్చాయి. భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ బాగుంటే విజయ్‌ని ఆపడమే కష్టమైపోయేది. టాలీవుడ్ నుంచి 20 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్లు తెచ్చుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని తట్టుకోలేక ఒకటికి 10 అకౌంట్లు క్రియేట్ చేసి, బన్నీని టాప్‌లో నిలబెట్టారు.

ఆ విషయం అటు ఉంచితే వరుస ఫ్లాపులతో విజయ్ దేవరకొండకి క్రేజ్ పడిపోయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంతగా లేవు. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మృణాల్ చేసిన రెండు తెలుగు సినిమాలు కూడా సూపర్ హిట్స్ మాత్రమే కాదు, క్లాసిక్స్ కూడా..

Vijay Deverakonda : డార్లింగ్ తో రౌడీ స్టార్ స్క్రీన్ షేర్..

అలాంటిది ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీకి సరైన బుకింగ్స్ పడకపోవడం చూసి, టాలీవుడ్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ ఆశ్చర్యపోతున్నారు. విజయ్‌ని తొక్కాలని కావాలని కొందరు హీరోల ఫ్యాన్స్, ‘ఖుషీ’ సినిమాపై తీవ్రమైన నెగిటివిటీని ప్రచారం చేశారు. ఈ కారణంగా ఆంధ్రాలో ఈ మూవీకి నష్టాలు వచ్చాయి. ఇప్పుడు ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీకి సరైన బుకింగ్స్ రాకపోవడానికి కూడా ఇదే రకమైన కుట్ర జరుగుతోందని అంటున్నారు రౌడీ ఫ్యాన్స్. ఈ సినిమాకి క్లీన్ పాజిటివ్ టాక్ రాకపోతే, ‘ది ఫ్యామిలీ స్టార్’ని తొక్కేయడానికి చాలా శక్తులే కాచుకుని కూర్చున్నాయి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post