Pawan Kalyan Ustaad Bhagat Singh Movie : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయాలతో తెగ బిజీగా గడుపుతున్నారు. దీంతో ఆయన చేస్తున్న, చేయాల్సిన సినిమాలన్నీ డైలామాలో పడ్డాయి. అప్పుడెప్పుడో కరోనాకి ముందు మొదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా, ఎప్పుడో వస్తుందో తెలియని పరిస్థితి. అసలు వస్తుందో లేదో కూడా అర్థం కానీ పొజిషన్..
అందం ఉంది, అదృష్టం కలిసి రాకుంది! అను ఇమ్మాన్యూయల్కి తప్పని తిప్పలు..
పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో ప్రకటించిన ‘ఓజీ’ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కూడా ‘హరిహర వీర మల్లు’కంటే ముందు సుజిత్ సినిమాని పూర్తి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.. ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్‌తో చేస్తున్న సినిమా పేరు కూడా మరిచిపోయినట్టు మాట్లాడాడు.
ఈ హడావుడిలో హరీశ్ శంకర్‌తో చేయాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై డైలామా ఏర్పడింది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ దశరథ్, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. విజయ్ హీరోగా వచ్చిన ‘తేరీ’ (తెలుగులో పోలీసోడు) మూవీకి ఈ ‘ఉస్తాద్’ రీమేక్ అని టాక్ వినబడుతోంది.
10 ఏళ్లుగా నాకౌట్ భయం! ఈసారి అయినా దాటుతారా… 2014 నుంచి అదే తీరు..
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో హరీశ్ శంకర్, ఈ ప్రాజెక్ట్‌ని పక్కనబెట్టేశాడు. ఆంధ్రా ఎన్నికలు అయిపోయి, ఆ తర్వాత పవన్ ‘ఓజీ’ మూవీ పూర్తి చేసేలోపు.. మాస్ రాజా రవితేజతో ఓ సినిమా చేయబోతున్నాడు హరీశ్ శంకర్. ఇప్పటికే రవితేజ- హరీశ్ శంకర్ మూవీకి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యాయని, త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతుందని టాక్ వినబడుతోంది.
రవితేజతో ‘షాక్’ మూవీతోనే దర్శకుడిగా కెరీర్ మొదలెట్టాడు హరీశ్ శంకర్. ఆ మూవీ పెద్దగా ఆడకపోయినా ఆ తర్వాత వచ్చిన ‘మిరపకాయ్’ మంచి హిట్టు కొట్టింది.
‘టైగర్’ ఫ్లాప్! ‘ఈగల్’ విషయంలో ఇగోలకు పోయి, రవితేజ మళ్లీ తప్పు చేస్తున్నాడా..