Trisha Vishwambhara Remuneration : భోళా శంకర్ రిజల్ట్ తేడా కొట్టేయడంతో రీమేక్ సినిమాలను సైడ్ చేసిన చిరు.. ప్రస్తుతం కుర్ర దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. 18 ఏళ్ల క్రితం మురుగదాస్ దర్శకత్వంలో ‘స్టాలిన్’ సినిమాలో కలిసి నటించారు త్రిష, చిరంజీవి.
41 ఏళ్ల త్రిష, ఇప్పుడు కూడా కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోంది. వయసు మీద పడడంతో గ్లామర్ రోల్స్ తగ్గించి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. విజయ్‌తో కలిసి ‘లియో’ మూవీ చేసిన త్రిష, ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలోనూ నటిస్తోంది.
Vijay Deverakonda : విజయ్ తో సుక్కు సినిమా లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ వల్లే..
2015లో చివరిగా బాలయ్యతో ‘లయన్’ సినిమా చేసిన త్రిష, చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమా చేయడానికి రూ.12 కోట్లు డిమాండ్ చేసిందట. తెలుగు నిర్మాతలు కూడా కాదనకుండా త్రిష అడిగినంత ముట్టచెప్పేశారట. ఈ సినిమా కోసం నయనతార, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లను ప్రయత్నించారు. వాళ్లు నో చెప్పడంతో త్రిషకి అడిగినంత ముట్టజెప్పి, ఫైనల్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రూ.30 కోట్ల వరకూ తీసుకుంటున్నాడట. దీంతో తొలుత రూ.120 కోట్లు అనుకున్న ‘విశ్వంభర’ బడ్జెట్ రూ.200 కోట్ల మార్కు దాటేస్తుందని అంటున్నారు టాలీవుడ్ జనాలు.