Vijay Deverakonda : విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా లెవెల్లో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. లైగర్ రూపంలో పూరీ జగన్నాథ్ ఓ రాడ్ దింపడంతో రిజల్ట్ తేడా కొట్టేసింది కానీ ఆ మూవీ కాస్త బాగున్నా.. బాలీవుడ్లో బంపర్ కలెక్షన్లు వచ్చి ఉండేవి. ఖుషీ సినిమా, ఆంధ్రాలో తప్ప మిగిలిన ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ..
ఈ మూవీ ప్రమోషన్స్‌లో తెగ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటపెట్టాడు. ‘నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వడంటూ ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరిగే వాడిని. అలా కేరింత మూవీ ఆడిషన్స్‌కి వెళ్లాను, కానీ నన్ను సెలక్ట్ చేయలేదు.. అప్పుడే అనుకున్నా వీళ్లందరికీ ఏదో ఓ రోజు నేనేంటో చూపించాలి అని.. ఇప్పుడు అదే బ్యానర్లో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నా..
Vijay Deverakonda : విజయ్ తో సుక్కు సినిమా లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ వల్లే..
నేను, కొత్త దర్శకులతో పని చేస్తే, కొత్త హీరోలతో సినిమాలు తీసేవాళ్లకు అవకాశం లేకుండా పోతుంది. అందుకే కొత్త దర్శకులతో కాకుండా అనుభవం ఉన్న దర్శకులతో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను. సందీప్ రెడ్డి వంగా కానీ, తరుణ్ భాస్కర్ కానీ.. నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాననే సినిమాలు చేశారు. కొత్త వాళ్లు రావాలి. కొత్త దర్శకులు రావాలి. కొత్త దర్శకులు, కొత్త వాళ్లతో పని చేస్తే అన్ని విషయాల గురించి తెలుసుకుంటారు. ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటారు..’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ..