Vijay Deverakonda : అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, కొత్త సినిమా దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ఇకపై కొత్త దర్శకులతో సినిమాలు చేయకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే మొట్టమొదటి సినిమా చేసే దర్శకులకు అన్ని శాఖల మీద అవగాహన ఉండదు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు సినిమాకి భారీ నష్టం తెచ్చి పెట్టొచ్చు. కొత్త వారితో ప్రయోగాలు చేసి, నిర్మాతలకు నష్టం తేకూడదని అనుకుంటున్నా..’ అన్నాడు విజయ్ దేవరకొండ..
అయితే విజయ్ దేవరకొండ కెరీర్‌కి సాయమైంది కొత్త దర్శకులే. నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మాణ్యం’ సినిమాలో నాని ఫ్రెండ్‌గా నటించిన విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘పెళ్లి చూపులు’ సినిమాతో సోలో హీరోగా హిట్టు కొట్టాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీలో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో ‘ట్యాక్సీవాలా’ సినిమాలు చేశాడు..
Vijay Deverakonda : విజయ్ తో సుక్కు సినిమా లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ వల్లే..
విజయ్ చేసిన సినిమాల్లో సూపర్ హిట్టైన సినిమాలన్నీ కొత్త దర్శకులే ఇచ్చారు. కేవలం డైరెక్టర్ పరుశురామ్ మాత్రమే విజయ్‌కి హిట్టు ఇచ్చిన అనుభవం ఉన్న దర్శకుడు… కోలీవుడ్ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్షన్లో చేసిన ‘నోటా’, క్రాంతి మాధవ్ డైరెక్షన్లో చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘లైగర్’ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
తనకు స్టార్ స్టేటస్ ఇచ్చింది కొత్త దర్శకులు. అలాంటి కొత్త దర్శకులతో సినిమాలు చేయనని చెప్పడం ఎంతవరకూ కరెక్ట్.. ఓ వైపు నాని, రవితేజ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తుంటే, విజయ్ దేవరకొండ మాత్రం కొత్త దర్శకులతో పని చేయనని చెప్పడం స్టార్డమ్ కారణంగా అతనిలో పెరిగిన అహంకారానికి నిదర్శనమేనా!