Family Star Trailer : మిడిల్ క్లాస్ మైండ్‌సెట్, హై క్లాస్ సెటప్..

Family Star Trailer : చాలా తక్కువ టైమ్‌లో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ట్యాక్సీవాలా, గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకి వరుస ఫ్లాపులు పడ్డాయి. ‘డియర్ కామ్రేడ్’, ‘నోటా’ వంటి సినిమాలు కలెక్షన్లు ఎలా ఉన్నా, కొంతమందికి బాగానే నచ్చాయి. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ దెబ్బ కొట్టింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ సినిమా, భారీ భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా కరెక్టుగా ఆడి ఉంటే, ఈపాటికి ఇండియాలో పాన్ ఇండియా హీరోల లిస్టులో విజయ్ దేవరకొండ కూడా ఉండేవాడు. ‘ఖుషీ’తో సక్సెస్‌కి దగ్గరగా వెళ్లిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ మూవీనే నమ్ముకున్నాడు. ‘గీతా గోవిందం’ కాంబినేషన్ పరుశురామ్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Vijay Deverakonda : విజయ్ తో సుక్కు సినిమా లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ వల్లే..

అప్పుడెప్పుడో సంక్రాంతికి వస్తుందని అనుకున్న ‘ఫ్యామిలీ స్టార్’ లేటుగా ఏప్రిల్ 5న విడుదల అవుతోంది. మార్చి 28న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మిడిల్ క్లాస్ కుర్రాడు, హై క్లాస్ హీరోయిన్.. ప్రేమ, గొడవలు.. చూడడానికి రొటీన్ కమర్షియల్ లవ్ స్టోరీలాగానే అనిపిస్తున్నా, పరుశురామ్ మార్క్ కనిపించింది. సినిమా కూడా ఇదే లెవెల్‌లో వర్కవుట్ అయితే విజయ్ ఎదురుచూస్తున్న ‘గీతా గోవిందం’ లాంటి హిట్టు కొట్టేసినట్టే.

మృణాల్ ఠాకూర్ తెలుగులో చేసిన రెండు సినిమాలు కూడా బంపర్ హిట్. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ తర్వాత మృణాల్ చేస్తున్న ‘ది ఫ్యామిలీ స్టార్’, ముందు రెండు సినిమాల్లో 50 శాతం ఉన్నా, సూపర్ హిట్ కొట్టడం ఖాయమే!

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post