Vijay Deverakonda : విజయ్ తో సుక్కు సినిమా లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ వల్లే..

Vijay Deverakonda :‘ఖుషీ’ సినిమా టైమ్‌లో విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడు. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ- సుక్కూ కాంబోలో సినిమా ఉంటుందని అనుకున్నారంతా…

Poonam Kaur : ఇండస్ట్రీలో గురుజీ అంటే ఆయనకొక్కడే! స్క్రిప్ట్‌లు హైజాక్ చేసేవాడు గురూజీ కాదు..

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప 2’ సినిమా చేస్తున్న సుకుమార్, ఈ మూవీ తర్వాత రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27న చెర్రీ, సుకుమార్ సినిమా ప్రకటన వస్తుందని టాక్.. ‘పుష్ప 2’ సినిమా తర్వాత నేరుగా రామ్ చరణ్ సినిమాని మొదలెడతాడు సుకుమార్.. దీంతో విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో సినిమా ఇప్పట్లో లేనట్టే..

విజయ్ దేవరకొండ సినిమా ఆలస్యం కావడానికి మెగా ఫ్యామిలీయే కారణమని అంటున్నారు రౌడీ ఫ్యాన్స్. ఇంతకుముందు ఉదయ్ కిరణ్ అనౌన్స్ చేసిన సినిమాలను క్యాన్సిల్ చేయించినట్టే, విజయ్‌ని టార్గెట్ చేశారని ట్రోల్స్ చేస్తున్నారు. సుకుమార్ వంటి క్రియేటివ్ దర్శకుడి చేతిలో పడితే విజయ్ రేంజ్ పెరిగి, మెగా హీరోలకు పోటీ వస్తాడని భయపడుతున్నారని పోస్టులు పెడుతున్నారు.. ఈ విమర్శలపై మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post