Murali Mohan : మనవాడికి నేషనల్ అవార్డు వస్తే, టాలీవుడ్ ఎందుకు సన్మానించలేదు..

Murali Mohan

Murali Mohan : పుష్ప సినిమాలో నటనకు అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. టాలీవుడ్ నుంచి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు అల్లు అర్జున్. అయితే టాలీవుడ్‌ పెద్దల నుంచి బన్నీకి వచ్చిన ప్రశంసలు చాలా తక్కువ..

‘అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దలు ఎందుకని స్పందించలేదు. కనీసం అతన్ని పిలిపించి, ఓ వేడుక చేసి ఎందుకు సన్మానించలేదు? ఇంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా చెన్నైలోనే ఉండేది. అప్పుడు ఎవ్వరూ ఇలా చేసేవాళ్లు కాదు. ఏ హీరో ఏ ఘనత సాధించినా పరిశ్రమ అంతా కలిసి తమ విజయంగా అనుకునేవాళ్లు. ఆత్మీయంగా సన్మానించుకునేవాళ్లు. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు’ అంటూ కామెంట్ చేశాడు సీనియర్ నటుడు మురళీ మోహన్..

Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో 60 సినిమాలు..

దాసరి నారాయణ రావు బతికి ఉన్న రోజుల్లో టాలీవుడ్‌కి పెద్దగా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో టాలీవుడ్‌ కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరు. చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా కొందరు చెబుతున్నా నందమూరి, మంచు, అక్కినేని ఫ్యామిలీ అందుకు ఒప్పుకునే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో సమైఖ్యత లేదని వాపోతున్నారు మురళీ మోహన్ వంటి సీనియర్ నటులు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post