YS Jagan : ఏపీ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని, కూటమిగా ఏర్పడగా వైసీపీ అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజెల్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, అమరావతిని రాజధానిగా ప్రకటించి, రాజధాని నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేసింది. అయితే జగన్ పార్టీ గెలుపుతో పరిస్థితి తారుమారు అయ్యింది.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా, ఏపీ రాజధాని ఏంటి? అంటే చెప్పలేని పరిస్థితి. ఇది జనాల్లో జగన్‌పై తీవ్రమైన నెగిటివిటీ రావడానికి ప్రధాన కారణం. అదీకాకుండా అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యుత్ కార్మికులు, వాలంటీర్లు వీళ్ళందరికీ వ్యక్తిగతంగా జగన్ చాలా హామీలు ఇచ్చారు. అయితే వాటిని నెరవేర్చడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం విఫలమైంది.
No Sentiments in Telangana Politics : కవిత అరెస్ట్‌ని లైట్ తీసుకున్న తెలంగాణ జనాలు..
రాజధాని లేదు, రోడ్ల పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా పాడుబడిన బడులను బాగుచేసే విషయంపై దృష్టి పెట్టలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఇంతకుముందు ప్రభుత్వం, కాలేజీ బ్యాంకు అకౌంటుల్లో ఫీజు రీయింబర్స్ చేసేది. అయితే జగన్ రాకతో దాన్ని విద్యార్థుల ఖాతాల్లో పడేలా చేశాడు.
ఇంతకుముందు ఫీజు ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది పడుతుందని కాలేజీలు ఎదురుచూసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఉద్యోగాల కల్పనలో కూడా జగన్ సర్కార్ విఫలమైంది. నాలుగేళ్ల పాటు జగన్ సర్కార్‌పై పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకునేందుకు గత ఏడాది నుంచి చాలా రకాలుగా ప్రయత్నించారు.
కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి.. మళ్లీ గెలిచాక వైజాగ్‌ని ఏపీ రాజధానిగా చేస్తానంటూ ప్రచారం మొదలెట్టారు. అయితే సర్వేలు మాత్రం వైసీపీ మళ్లీ ప్రభుత్వం చేపట్టే అవకాశం లేదని అంటున్నారు. జనం పల్స్ ఎలా ఉందో తెలియాలంటే మాత్రం జూన్‌లో వచ్చే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.
Credit : జ్వాల