No Sentiments in Telangana Politics : తెలంగాణలో కేసీఆర్‌ని, ఆయన ఫ్యామిలీని టచ్ చేస్తే, రాష్ట్రం తగలబడిపోద్ది! ఐదు నెలల వరకూ తెలంగాణ ఇలాకా మొత్తం దీన్నే నమ్మింది. అసలు కాంగ్రెస్ చేసిన ఆరు గ్యారెంటీలు జనాల్లోకి వెళ్లకపోయి ఉంటే, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేటోడే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ పూర్తిగా చల్లబడిపోయింది. కేసీఆర్ పూర్తిగా మీడియాకి దూరంగా ఉంటుంటే హరీశ్ రావు కూడా పెద్దగా బయటికి రావడం లేదు.
కేటీఆర్ ఇంతకుముందులా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండడం లేదు. అయితే కల్వకుంట్ల అరెస్ట్ మాత్రం కేసీఆర్ ఫ్యామిలీకి ఊహించని పరిణామమే. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ నుంచి 70 వేల ఓట్ల తేడాతో ఓడినప్పుడు కూడా కవిత, చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. ఈడీ అరెస్ట్ తర్వాత కూడా ఎంతో ధైర్యంగా కార్యకర్తలను అభివాదం చేస్తూ ఢిల్లీకి వెళ్లింది..
జైలుకి వెళ్లి వస్తే చాలు, సీఎం పదవి! అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, నెక్ట్స్ బాబు..?
తనను అరెస్ట్ చేస్తే, తెలంగాణలో బంధులు, రాస్తారోకోలో, నిరసనలు జరుగుతాయని కవిత భావించింది. ‘నన్ను ముట్టుకుంటే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే’ అంటూ కొన్ని నెలల క్రితం స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది కల్వకుంట్ల కవిత. అయితే జనాలు కవిత అరెస్ట్‌ని ఓ సాధారణ వార్తగా మాత్రమే చూశారు.
రాష్ట్రాన్ని దాదాపు పదేళ్లు పాలించిన మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్ట్ చేస్తే, రాష్ట్రం ఇంత ప్రశాంతంగా ఉంటుందని కేసీఆర్ ఫ్యామిలీ ఊహించి ఉండదు. తమిళనాడులో జరిగినట్టు నానా హంగామా జరుగుతుందని అనుకున్నారు. అయితే తెలంగాణ జనాలు పాలిటిక్స్‌లో నో సెంటిమెంట్స్ అని బాగా ఫిక్స్ అయినట్టు ఉన్నారు.. మున్ముందు ఎలాంటి పరిణామాలు జరిగినా, జనాలు ఇంతకుముందులా ఊగిపోయి చొక్కాలు చించుకోవడం, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం వంటివి ఇకపై సినిమాల్లోనే కనిపిస్తాయని రాజకీయ శక్తులకు బాగా అర్థమైనట్టే ఉంది.
Credit : జ్వాల