SSMB29 : మహేష్ సినిమాలో విలన్‌గా హృతిక్ రోషన్.. కాదంటే..

SSMB29 : గుంటూర్ కారం తర్వాత మహేష్, రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్‌లో ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లక ముందు నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహేష్, రాజమౌళి సినిమాలో హృతిక్ రోషన్‌ని విలన్‌గా నటింపచేయాలని గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయట..

Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?

హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నాడని టాక్. అదే హృతిక్ రోషన్, పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందే మహేష్, రాజమౌళి సినిమాలో విలన్‌గా నటించేందుకు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి హృతిక్ కాదంటే చియాన్ విక్రమ్‌ని విలన్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు జక్కన్న..

విక్రమ్ ఇంతకుముందు కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రల్లో నటించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రావన్’ (తెలుగులో విలన్) సినిమాలో విక్రమ్ ఇలాంటి పాత్రే చేశాడు. విక్రమ్ హీరోగా వచ్చిన ‘ఇరు మురుగన్’ (తెలుగులో ఇంకొక్కడు) సినిమాలో విక్రమే విలన్‌గా చేశాడు. అయితే మహేష్ సినిమాలో విలన్‌గా చేయడానికి విక్రమ్ ఒప్పుకుంటాడా? విక్రమ్ కూడా ఒప్పుకోకపోతే హాలీవుడ్ విలన్‌ని తీసుకొచ్చే పనిలో బిజీగా ఉంది జక్కన్న టీమ్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post