Arvind Kejriwal Arrest : ఢిల్లీ లిక్కర్ స్కామ్, భారత రాజకీయాల్లో కుదుపులు తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యింది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని కూడా ఇదే కేసులో అదుపులోకి తీసుకుంది ఈడీ.. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు బెయిల్ తీసుకున్న కేజ్రీవాల్‌ని గురువారం రాత్రి ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో యావత్ భారతం ఒక్కసారిగా షాకైంది. అయితే అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కొనసాగుతాడని ఆప్ పార్టీ ప్రకటించింది. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారంటూ వెల్లడించింది.
Indian Students in Abroad : కోటి ఆశలతో విదేశాలకు వెళ్లి, విగతజీవులుగా తిరిగి వస్తూ..
కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అరెస్ట్ చేసిన వారి సంఖ్య 16కి చేరింది. గురువారం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు చేయగా, కేసుకి సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని సమాచారం. అయినా ఇప్పటికే ఈ కేసులో 9 సార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుంది ఈడీ.
అయితే లోక్‌సభ ఎన్నికల ముందు జరుగతున్న ఈ హై డ్రామా, ఓటర్లను ప్రభావితం చేయొచ్చు. ఆప్ పార్టీ నేతపై సానుభూతి పవనాలు వీస్తే బీజేపీకి బొక్క పడుతుంది. అదే అప్ నేత అవినీతి చేశాడని జనాలు భావిస్తే, బీజేపీకి అనుకూలంగా ఓట్ల వర్షం కురుస్తుంది.