Janasena – BJP : అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన చిరూ, ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుని పూర్తిగా సినిమాలకు అంకితం అయ్యారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే దారిలో నడవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..
Pawan Kalyan : సినిమాకి పొలిటికల్ రంగు! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిప్స్ రిలీజ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత జులై 18 లేదా 20 తేదీల్లో బీజేపీలో తన పార్టీని విలీనం చేయబోతున్నాడని రాజకీయా వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్న సమాచారం.. ఏపీ ఎలక్షన్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టు సమాచారం.
గత ఎన్నికల్లో ఘోర ఓటమి, ఈసారి పొత్తులో చాలా వరకూ సీట్లు టీడీపీకి వెళ్లడం వంటి పరిణామాలు, పవన్ కళ్యాణ్‌కి రాజకీయాలపై ఆసక్తి పోయేలా చేశాయని అంటున్నారు. అదీకాకుండా పిఠాపురం నుంచి పోటీ చేసి, బంపర్ మెజారిటీలో గెలవచ్చని అనుకుంటే, అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా పవన్‌ని నిరుత్సాహానికి గురి చేశాయట. దీంతో రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి, స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్..
Pawan Kalyan : పిఠాపురం నుంచి పవన్ పోటీ.. ప్రత్యర్థిగా రామ్ గోపాల్ వర్మ..
అయితే ఎన్నికలకు ముందు ఇలా పార్టీ విలీనం వార్త బయటికి రావడం, జనసేన ఓటు బ్యాంకుని మరింతగా దెబ్బ తీసే అవకాశం లేకపోలేదు. పవన్ కళ్యాణ్‌కి పిఠాపురంలో కూడా గెలుపు దక్కకుండా చేసేందుకు ప్రతిపక్షాలే ఇలా విలీనం వార్తను వైరల్ చేస్తుందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.