Dhanush : మాస్ట్రోగా గుర్తింపు తెచ్చుకున్న ఇళయరాజా జీవితంతో బయోపిక్ రూపొందబోతోంది. ఈ మూవీలో ఇళయరాజా పాత్రలో ధనుష్ నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘నా జీవితంలో కేవలం ఇద్దరే ఇద్దరు బయోపిక్ మూవీస్‌లో నటించాలని అనుకున్నా. ఒకటి రజినీ సర్. ఇంకోటి ఇళయరాజా సర్. ఓ కోరిక ఇలా నెరవేరబోతోంద’ని చెప్పాడు ధనుష్..
AaduJeevitham : ఎడారిలో మేకల మధ్య.. ‘ఆడుజీవితం’ సినిమా ఓ నిజ జీవిత సంఘటన..
ఇళయరాజా బయోపిక్‌కి స్వయంగా ఇళయరాజానే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ‘కెప్టెన్ మిల్లర్’ డైరెక్టర్ అరుణ్ మాథీశ్వరన్ తెరకెక్కిస్తున్నాడు. చెన్నై సెంటర్లో చేతిలో హార్మోనియం పెట్టెతో ఉన్న బుల్లి ఇళయరాజా పోస్టర్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ‘ది కింగ్ ఆఫ్ మ్యూజిక్’ అనే క్యాప్షన్‌ని జోడించింది..
1000కి పైగా సినిమాలు, 7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించిన ఇళయరాజా పక్కా కమర్షియల్. తాను సంగీతం అందించిన పాటలను, సింగర్లు ఎక్కడ పాడాలన్నా తనకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కాపీ రైట్స్ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనుడు. జ్ఞానతేసిగన్ పేరుతో పుట్టిన ఇళయ రాజా, సినిమాల్లోకి వచ్చే ముందు పేరు మార్చుకున్నాడు. జ్ఞానతేసిగన్, ఇళయరాజాగా మారి, సంగీత ప్రపంచాన్ని ఎలా ఒళలాడించాడనే కథాంశంతోనే ‘ఇళయరాజా’ మూవీ తెరకెక్కనుంది.