Pawan Kalyan : సినిమాకి పొలిటికల్ రంగు! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిప్స్ రిలీజ్..

Pawan Kalyan : ఏపీ ఎలక్షన్స్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పొత్తు పంచాయితీ, సీట్ల గొడవ, సీటు రాని రెబల్స్ ఆగ్రహం, ప్రచారం, పోటీ.. ఇలా వచ్చే రెండు మూడు నెలల పాటు రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారనుంది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మూడు నెలల ముందు నుంచే సినిమా షూటింగ్స్ అన్నీ సైడ్ చేసేశాడు.. ఈ మధ్యలో సడెన్ సర్‌ప్రైజ్‌గా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిప్స్ రిలీజ్ అయ్యింది…

ఓ లక్ష్మీ నరసింహా స్వామి జాతర ఉత్సవంలో పూజారులపై జరిగే అమానుష దాడులు.. ‘నీ రేంజ్ ఇది!’ అంటూ గాజు గ్లాస్‌ని కింద పడేసే విలన్.. గాజు పగిలిపోగానే పైకి ఎగిరే ఎర్ర కండువా.. హీరో ఎంట్రీ! హరీశ్ శంకర్, పవన్ మాస్ ఫ్యాన్స్‌కి నచ్చే రొటీన్ మాస్ స్టైల్‌లోనే గ్లిప్స్‌ని కట్ చేశాడు..

SSMB 29 : రాజమౌళి – మహేష్ సినిమా ఉంటుందా? లేదా..

గబ్బర్ సింగ్ స్టైల్ పోలీస్ యాటిట్యూడ్‌ని చూపించిన పవన్ కళ్యాణ్, ‘గాజు పగిలే కొద్దీ, పదును ఎక్కుద్ది!’, ‘కచ్ఛితంగా గుర్తు పెట్టుకో, గాజు అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం..’ అంటూ పొలిటికల్ టచ్ ఉన్న డైలాగ్‌లను చెప్పాడు. మధ్యలో కాదనకుండా హీరోయిన్ శ్రీలీల ఓసారి తళుక్కున అలా మెరిచి, మాయమైంది.. జనసేన కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు ఈ గ్లిప్స్ నచ్చినా, మిగిలిన వారికి సినిమాకి పొలిటికల్ రంగు అద్దినట్టే అనిపిస్తుంది..

ఏపీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలిస్తే ఓకే, కానీ ఈసారి రిజల్ట్ తేడా కొడితే.. ఈ డైలాగులన్నీ వృథా అయిపోయినట్టేగా! అసలు ఈ సినిమాను పవన్ కళ్యాణ్ పక్కనబెట్టేసి చాలా రోజులైంది. షూటింగ్ జరిగింది కూడా చాలా తక్కువ. అయితే ఇప్పుడు పొలిటికల్ మైలేజీ కోసం అర్జెంట్‌గా దీన్ని బయటికి తెచ్చి, గ్లిప్స్ కూడా కొన్ని డైలాగులు డబ్బింగ్ చెప్పాడు. అయితే ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో జూన్ 4న వచ్చే ఫలితాలు తేలుస్తాయి.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post