Governor CP Radhakrishna : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా సీ.పీ. రాధాకృష్ణన్ నియమించబడ్డారు. ప్రస్తుతం 2023 నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్, తెలంగాణకి కూడా గవర్నర్గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఇంతకుముందు తమిళనాడు రాష్ట్ర బీజేపీ స్ట్రేట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించిన రాధా కృష్ణన్, 1998, 1999 ఎన్నికల్లో కొయంబత్తూర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
ఆ తర్వాత వరుసగా 2004, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రాధా కృష్ణన్ ఓటమి చవి చూశారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరుపున బరిలో దిగబోతోంది. దీంతో ఆమె తెలంగాణ గవర్నర్ స్థానంతో పాటు పుదుచ్చేరి గవర్నర్ స్థానానికి రాజీనామా సమర్పించగా తన ప్లేస్లో సీ.పీ. రాధా కృష్ణన్ని నియమిస్తున్నట్టుగా ప్రకటించారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
Pushpa 2 – Kalki 2898AD : ఎన్నికల దెబ్బకు ‘పుష్ప’తో పోటీ పడబోతున్న ‘కల్కి’..
పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరించిన తమిళిసై సౌందర్యరాజన్, తమిళనాడులోని కన్యాకుమారి, దక్షిణ చెన్నై, తిరునల్వేలి లోక్సభ స్థానాల్లో ఏదో ఒక నియోజిక వర్గం నుంచి పోటీలో దిగాలని భావిస్తోంది. అయితే బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే తమిళిసై పోటీ చేసే ప్లేస్ డిసైడ్ అవుతుంది..