Pushpa 2 – Kalki 2898AD : మే 9న రిలీజ్ కావాల్సిన ‘కల్కి’ సినిమా, ఎన్నికల షెడ్యూల్ కారణంగా వాయిదా పడనుంది. మే 9న సినిమా రిలీజ్ ఉంటే, మే 13న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో సినిమా విడుదల అయితే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడడం ఖాయం. రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించిన ‘కల్కి’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తేనే హిట్టు కింద లెక్క..
దీంతో ‘కల్కి’ మూవీ, మే 9 నుంచి ఆగస్టు 15కి వాయిదా పడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15 కోసం ఇప్పటికే అల్లు అర్జున్ ‘పుష్ప’సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే పుష్ప సినిమా రిలీజ్ డేట్పై చాలా రోజులుగా అనుమానాలు ఉన్నాయి. ఆగస్టు 15న పుష్ప రాకపోతే అదే రోజున రావాలని ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ కూడా కాచుకు కూర్చుంది.
Mayuri Movie : రికార్డ్ బ్రేక్ అవని.. 14 నంది అవార్డ్స్ గెలుచుకున్న సినిమా..
ఎందుకంటే ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే గురువారం, ఆ తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం, ఆ తర్వాత రాఖీ పండగ. దీంతో ఏకంగా వరుసగా 6 రోజుల లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది. అందుకే ఈ డేట్ చాలా స్పెషల్గా మారింది.
ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి’ మూవీ కూడా ఇదే డేట్ కోసం చూస్తోంది. ‘కల్కి’ సినిమాతో పాటు ‘పుష్ఫ’, ‘దేవర’ సినిమాలపై కూడా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది. కాబట్టి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా, ఇండిపెండెన్స్ డే రోజున వస్తుందో చూడాలి.