Vishwak Sen Gaami : మన తెలుగు సినిమాని కూడా పట్టించుకోండి! ‘గామి’ మూవీని దాటేసిన ‘ప్రేమలు’..

Vishwak Sen Gaami : తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు రావడమే చాలా అరుదు. వచ్చిన వాటికి సరైన ఆదరణ దక్కడం ఇంకా అరుదు. తాజాగా విశ్వక్ సేన్ చేసిన వినూత్న ప్రయత్నం ‘గామి’ చిత్రానికి తొలి వారంలో మంచి ఆదరణ వచ్చింది. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఇవేన్ వచ్చేసింది. అయితే వీకెండ్ తర్వాత కలెక్షన్లు అనుకున్నంతగా రావడం లేదు. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోవడంతో ‘ప్రేమలు’ మూవీకి రెస్పాన్స్ పెరిగింది..

Devara Update : మళ్లీ సాగరానికి దేవర..

దీనికి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరో మహేష్ బాబు ‘ప్రేమలు’ మూవీపై చేసిన కామెంట్లు, ఈ మూవీకి ప్రమోషన్స్ తెచ్చిపెట్టాయి. కలెక్షన్లు పెరగడానికి కారణమయ్యాయి. ‘గామి’ చిత్రానికి ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సపోర్ట్ అయితే రావడం లేదు. హీరో విశ్వక్ సేన్, ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై మాట్లాడాడు. మన తెలుగు సినిమాని చూసి, కాస్త ప్రమోట్ చేయాలని కోరాడు..

నిజానికి ఇదే ‘గామి’ సినిమాని తమిళ్‌లో లేదా మలయాళంలో తీసి ఉంటే, తెలుగులో సూపర్ హిట్ చేసేవాళ్లు. కన్నడలో రూపొందిన ‘కాంతార’ మూవీ, తెలుగులో బంపర్ కలెక్షన్లు కొల్లగొట్టింది. మలయాళ యూత్ లవ్ స్టోరీ ‘ప్రేమలు’ మూవీకి తెలుగులో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మంగళవారం ప్రేమలు కలెక్షన్లు, తెలుగు సినిమాలు గామి, భీమా రెండు కలిపి రాబట్టిన కలెక్షన్ల కంటే ఎక్కువున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు ఆరేళ్లు కష్టపడి తీసిన తెలుగువాళ్లు ఆ మాత్రం ఆవేదన పడడం తప్పు లేదు..

Pawan Kalyan : నా నాలుగో పెళ్లానివి నువ్వే..!

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post