Devara Update : మళ్లీ సాగరానికి దేవర..

Devara Update : ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘దేవర’. రచయితగా కెరీర్ మొదలెట్టి, ప్రభాస్ ‘మిర్చి’తో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఈ మూవీ డైరెక్టర్. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజీ’ సూపర్ హిట్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Jr NTR Devara : వైజాగ్ అంటే.. భయపడుతున్న యంగ్ టైగర్..

అయితే వరుసగా నాలుగు సక్సెస్‌లు అందుకున్న కొరటాల శివ, ‘ఆచార్య’ రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ని ఫేస్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడం కంటే, ఈ సినిమా ద్వారా వచ్చిన ట్రోలింగ్, కొరటాలను ఎక్కువ బాధపెట్టి ఉంటుంది. అందుకే ‘దేవర’ సినిమాను ఛాలెంజింగ్‌గా తీసుకుని, తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘దేవర’ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. ఏప్రిల్ 5న సినిమా వస్తే, జగజ్జీవన్ రామ్ జయంతి, 9న ఉగాది, 10న ఈద్ ఉల్ ఫితర్, 14న అంబేద్కర్ జయంతి.. ఇలా వరుసగా సెలవులు వచ్చేవి. పాజిటివ్ టాక్ వస్తే చాలు, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ ఉండేది.

అయితే అనుకోని కారణాలతో ఈ మూవీ, ఏప్రిల్ నుంచి అక్టోబర్‌ 10కి వాయిదా పడింది. ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ మూవీపై మరింత హైప్ పెంచుతుంది.

Jr NTR : దేవర వచ్చేది అప్పుడే! బన్నీని ఇబ్బంది పెట్టకుండా సైడ్ ఇచ్చిన తారక్..

ఇప్పటికే దేవర ఫస్ట్ పార్ట్ చివరదశ షూటింగ్ జరుపుకొంటుండగా.. ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దేవర టీం ఈ నెల 21 నుంచి గోవాకు పయనమవనుంది. గత సంవత్సరం డిసెంబర్ లో గోవాలో షూట్ జరిగిన విషయం తెలిసిందే. మరిన్ని కీలక సన్నివేశాల కోసం దేవర టీమ్ మళ్లీ గోవాకు వెళ్లనుంది.

 

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post