Vishwak Sen Gaami : ఒకప్పుడు టాలీవుడ్లో రవితేజ, అల్లరి నరేశ్ మినిమం గ్యారెంటీ హీరోలుగా ఉండేవాళ్లు.. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టగలిగేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ మారింది. రవితేజ సినిమాలకు భారీ నష్టాలు మిగులుతుంటే కామెడీ వర్కవుట్ కాకపోవడంతో నరేష్ మొత్తం సీరియస్ సబ్జెక్స్ చేస్తున్నాడు… ఈ ఇద్దరూ ఖాళీ చేసిన మినిమం గ్యారెంటీ హీరో ట్యాగ్‌కి విశ్వక్ సేన్ కరెక్ట్‌గా సెట్ అవుతాడు..
Gaami Review : టాలీవుడ్లో మరో ప్రయోగం..
ఎందుకంటే విశ్వక్ సేన్ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతీ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. ట్రోల్స్ తెచ్చుకున్న ‘పాగల్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అబో యావరేజ్‌గా నిలవగా, ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా దమ్కీ’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలు తెచ్చిపెట్టాయి..
తాజాగా ‘గామి’ సినిమా కూడా మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. మొదటి 3 రోజుల్లో రూ.20.3 కోట్ల వసూళ్లు సాధించిన ‘గామి’, వీక్ డేస్‌లో కూడా కలెక్షన్స్ హోల్డ్ చేయగలిగితే, ఈజీగా రూ.50 కోట్ల క్లబ్లో చేరడం గ్యారెంటీ. ఎందుకంటే ఇంటర్ పరీక్షలు ముగుస్తుండడంతో ఈ వారంలో ‘గామి’ కలెక్షన్లు మరింత పెరగవచ్చు.. వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో ‘గామి’ మూవీకి పండగే..
Premalu Review : క్యూట్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ..
గోపిచంద్ ‘భీమా’ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా, మొదటి 3 రోజుల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. అయితే వీక్ డేస్‌లో ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అవ్వకుండా ఉండడం మెయిన్. మలయాళ డబ్బింగ్ మూవీ ‘ప్రేమలు’ మూవీకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ సీజన్లో విడుదల కావడంతో కలెక్షన్లపై ఆ ప్రభావం పడింది.